(Source: ECI/ABP News/ABP Majha)
Broken Idol: ఇంట్లో దేవుడి విగ్రహం అకస్మాత్తుగా పగిలిపోతే దాని అర్థం ఏంటో తెలుసా?
Broken Idol: దేవుని విగ్రహాలు, ఫోటోల విషయంలో చాలా నియమాలు ఉన్నాయి. దేవుని విగ్రహాలు, ఫోటోలు పగిలిపోతే ఏమి చేయాలి? అలాంటి విగ్రహాలు, ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా..?
Broken Idol: హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఇంట్లో ఎవరో ఒక దేవుడు లేదా దేవత విగ్రహం ఉంటుంది. ఇంట్లో ఉదయం, సాయంత్రం ఈ దేవతల విగ్రహాలను లేదా ఫోటోలను పూజించడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. ఈ విగ్రహాలను భగవంతుని స్వరూపంగా భావిస్తారు, కానీ చాలాసార్లు ఈ విగ్రహాలు మన చేతుల్లో లేదా మనకు తెలియకుండానే విరిగిపోతాయి. అయితే అలా పగిలిన విగ్రహాలను పూజ్య భావన కారణంగా ప్రజలు వాటిని బయట పెట్టడానికి భయపడతారు. ఐతే ఇంట్లో దేవుడి విగ్రహం, ఫొటో పగిలిపోతే ఏం చేయాలి..?
1. విగ్రహాలు అకస్మాత్తుగా పగిలితే?
ఇంట్లోని విగ్రహం అకస్మాత్తుగా పగిలిపోతే, దాని ద్వారా ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. చాలా సార్లు విగ్రహం ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా విరిగిపోతుంది, ఇది ఎందుకు జరిగిందో అర్థం కాదు. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతుంటే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతోందని అర్థం చేసుకోండి. అటువంటి పరిస్థితిలో, విరిగిన విగ్రహాన్ని ఇంట్లో నుంచి బయట పడవేయాలి.
2. విగ్రహం పగలడం శుభసూచకమా..?
దేవతా విగ్రహాలు పగలడంపై అనేక విధానాల ప్రకారం పలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అయితే దేవతా విగ్రహం విరిగిపోయిందంటే ఇంటికి ఏదైనా అనర్థం జరుగుతుందని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో దేవుడి విగ్రహం పగలితే ఆ ఇంటిలోని ప్రతికూల శక్తి బయటకు వెళ్లిపోతుందని చాలా మంది నమ్ముతారు. విగ్రహం పగలడం మంచిదికాదని భావించనప్పటికీ, దాని వల్ల ఆ ఇంటిలో నివసించే వారికి మంచి జరుగుతుందని భావిస్తారు.
3. పగిలిన విగ్రహం ఇంట్లో ఉంటే?
మనకు తెలిసి, తెలియక ఒక్కోసారి ఇంట్లోని దేవతా విగ్రహం ఒక్కసారిగా పడి విరిగిపోతుంది. అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే, అది భవిష్యత్తులో మీకు ఏమి జరుగుతుందో సూచనగా భావించాలి. విరిగిన విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల ఏదైనా ప్రమాదం జరగకుండా ఉంటుందని, తద్వారా విపత్తును నివారించవచ్చని చెబుతారు. అయితే అలాంటి పగిలిన విగ్రహాలను ఇంట్లో నుంచి తొలగించాలని శాస్త్రాల్లో పేర్కొన్నారు.
4 విగ్రహం పగిలిపోతే ఏం చేయాలి?
అనేక సార్లు మీరు రహదారి కూడళ్లలో విరిగిన విగ్రహాలను చూసి ఉంటారు, కానీ వాస్తవానికి ఇలా చేయకూడదు. ఇంట్లోని విగ్రహం పగిలితే గౌరవప్రదంగా నదిలో నిమజ్జనం చేయాలి. దేవుడి ఫొటో అద్దం మాత్రమే పగిలితే మళ్లీ దాన్ని బిగించి అదే స్థలంలో అమర్చాలి.
Also Read : నైవేద్యం ఇలా సమర్పించండి, పూజ తప్పక ఫలిస్తుంది
ఇంట్లో ఎక్కడైనా దేవుని విగ్రహాలు పోయినా, విరిగిపోయినా పై చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంట్లో అలాంటి విరిగిన విగ్రహాలు ఉంటే, ఖచ్చితంగా వాటిని బయట పడవేయండి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.