అన్వేషించండి

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri SeethaRamula Kalyanam: శ్రీరామనవమి సందర్భంగా...రామాయణం చదవాలి అనుకునేవారికోసం...108 నామాల్లో సంపూర్ణ రామాయణం.

Sri Rama Navami 2023: మనిషిగా జన్మించాక ఎలాగో ఒకలా బతికేయడం కాదు..ఎలా బతకాలో తెలుసుకోవాలి. ఎలాంటి జీవితం గడపాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, చుట్టుపక్కలవారితో ఎలా మమేకమవ్వాలి, కష్టసుఖాల్లో ఎలా ముందుకు సాగాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండడం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకేఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు. పేరుకే దేవుడైనా మనిషిగా ఎలా బతకాలో బతికి చూపించాడు దశరథ తనయుడు  శ్రీ రాముడు. శ్రీరామనవమి సందర్భంగా సంపూర్ణ రామాయణం చదవలేని వారు 108 నామాలు చదువుకుంటే చాలు....

ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుజ్ఞ హనుమత్ సమేత  శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం 
1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46.గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66.సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ
రామ రామ జయసీతా రామ....

Also Read: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక

భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి  నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు. అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని నడక అని అర్థం. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు  దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే  రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే. 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

Also Read: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
The Raja Saab Story : అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
Embed widget