అన్వేషించండి

Sri Rama Navami 2022: అన్ని సమస్యలకు చెక్ పెట్టి విజయాన్నందిచే శ్లోకం ఇది

సత్యం, ధర్మాన్ని ఆచరించిన శ్రీరామ చంద్రుడిని మూడు సంధ్యల్లో మనస్ఫూర్తిగా ధ్యానించడం వల్ల సకల సమస్యలు తీరి ప్రశాంతతని పొందుతారని పండితులు చెబుతారు. ఈ పూటలా పఠించాల్సిన ఆ శ్లోకాలు మీకోసం....

శ్రీరాముడు మానవుడిగా అవతారం ఎత్తడానికి కేవలం రావణాసురుని సంహరించడానికో లేక, దుష్టులైన రాక్షసులను చంపేయడానికి మాత్రమే కాదు. ధర్మం అంటే ఏంటి, దానిని ఎలా ఆచరించాలి, సత్యం అంటే ఏంటి-ఎప్పుడూ సత్యాన్నే ఎందుకు పలకాలి లాంటి మహత్తరమైనవి మనుషులకు బోధించేందుకే శ్రీరాముడు మానవుడిగా అవతారం ఎత్తాడు.  కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా మాత్రమే కాదు సర్వమానవ బంధాలను ఎంత పవిత్రంగా పాటించాలో ఆచించి చూపించాడు శ్రీరామచంద్రుడు. అందుకే మూడు పూటలా రాముడి శ్లోకం చదివడం ద్వారా మనస్సు శుద్ధి జరుగడంతో పాటూ కష్టనష్టాలు ఇబ్బందులు తొలగి ప్రశాంతతని, విజయాన్ని పొందుతామని చెబుతారు. ఇవే ఆ శ్లోకాలు...

ఉదయం చదవాల్సిన శ్లోకం
ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకం రంజితానంతలోకం
బాలం బాలారుణాక్షం భవముఖవినుతం భావగమ్యం భవఘ్నమ్,
దీప్యంతం స్వర్ణక్లప్తై ర్మణిగణనికరై ర్భూషణై రుజ్జ్వలాంగం
కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామ మీషత్ స్మితాస్యమ్.

దేవతలకు అధిపతి అయిన వాడు,  సూర్యవంశశ్రేష్ఠుడు , ఎల్లలోకాలనూ ఆనందింపజేయువాడు, బాలుడు, లేతసూర్యుని పోలిన ఎఱ్ఱనైన నేత్రములు కలిగినవాడు,  హృదయంలో ధ్యానింపదగినవాడు, సంసారబాధను పోగొట్టువాడు, శ్రేష్ఠుడు, మణులు పొదగబడిన కనకాభరణములతో ప్రకాశించువాడు , కౌసల్య కుమారుడు, నా హృదయందున్నవాడు , చిరునవ్వు మోమువాడు అయిన రాముని ప్రాతఃకాలమందు ధ్యానం చేస్తున్నాను.

Also Read: రామాయణం గురించి మరికొన్ని ప్రశ్నలు, వీటికి సమాధానం తెలుసా
మధ్యాహ్నం చదవాల్సిన శ్లోకం
మమధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం
మార్తాండానేకభాసం మరకతనికరాకార మానందమూర్తిమ్,
సీతావామాంకసంస్థం సరసిజనయనం పీతవాసో వసానం
వందేఽహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతమ్.

మాణిక్యసమూహముచే సుందరుడు, చూపులతో చిరునవ్వులు చిందించువాడు, బహుసూర్యుల కాంతిగలిగిన వాడు, మరకత మణుల ప్రోగువంటి ఆకారము కలవాడు, , ఆనందస్వరూపుడు, ఎడమతొడపై సీత ఉన్నవాడు, పద్మాలవంటి నేతార్లు కలిగినవాడు,  పచ్చని వస్త్రం ధరించినవాడు, అన్ని లోకాలకు నివాసస్థానమైనవాడు, శ్రేష్ఠములైన ధనుర్బాణములు ధరించినవాడు, నా మనస్సులో ప్రకాశిస్తున్నవాడు అయిన రామచంద్రునికి మధ్యాహ్నం నమస్కరిస్తున్నాను.

Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం 
సాయంత్రం చదవాల్సిన శ్లోకం
ధ్యాయే రామం సుధాంశుం నతసకలభవారణ్యతాపప్రహారం
శ్యామం శాంతం సురేంద్రం సురమునివినతం కోటిసూర్యప్రకాశమ్,
సీతసౌమిత్రిసేవ్యం సురనరసుగమం దివ్యసింహాసనస్థం
సాయాహ్నే రామచంద్రం స్మితరుచిరముఖం సర్వదా మే ప్రసన్నమ్.

చంద్రుడిలా ఉండేవాడు, నమస్కరించేవారికి సంసారారణ్యబాధను అంతం చేయువాడు,  నల్లనివాడు , శాంతుడు, దేవతలు మునులతో పూజలందుకునేవాడు, కోటి సూర్యుల కాంతిని కలిగి ఉండేవాడు, సీతాలక్ష్మణులు సేవిస్తున్నవాడు, దేవతలకు మనుష్యులకు సులభుడైనవాడు , గొప్పసింహాసనమందున్నవాడు , నవ్వుచే సుందరమైన మోముగల రామచంద్రుడిని సాయంకాలం ధ్యానిస్తున్నాను.

(శ్రీరామ కర్ణామృతం నుంచి సేకరించిన శ్లోకాలివి)
Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం Part 2

Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం Part 3

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget