Image Credit: Freepik
Sravana Masam 2023: ఈనెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరించడం వలన శ్రావణమాసం అనే పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం కావడం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణమాసం అంటే శ్రీమహావిష్ణువు ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ నెలలో చేసే నోములు, వ్రతాలు, పూజల వల్ల లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రావణ, భాద్రపద మాసాలు వర్షరుతువులో వస్తాయి. పంచభూతాల్లో ఏ మార్పులు వచ్చినా ఆ ప్రభావం శరీరంపై పడుతుంది. విస్తారంగా వర్షాలు కురిసే సమయం కావడంతో శరీరానికి జల సంబంధమైన వ్యాధులొస్తాయి. అందుకే ముఖానికి, పాదాలకు పసుపు రాసుకోవడం ద్వారా కొంత అనారోగ్యాన్ని పారద్రోలొచ్చు. కుంకుడుకాయతో తలరుద్దుకుంటే ఆరోగ్యానికి మంచిదంటారు పెద్దలు. మరీ ముఖ్యంగా ఈ నెలలో కనీసం రెండుసార్లు నదీ స్నానం చేయాలని సూచిస్తారు, ఎందుకంటే వర్షాల కారణంగా నదులన్నీ ఒండ్రుమట్టి, ఇసుక, వివిధ రకాల ఔషధ గుణాలున్న ఆకులతో ప్రవహిస్తాయి. ఈ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక పూజల విషయానికొస్తే శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్నీ పవిత్రమైనవే.
Also Read: ఆగష్టు 14 నుంచి 20 వారఫలాలు: ఈ వారం ఈ రాశివారు ఒకేసమయంలో గుడ్ న్యూస్-బ్యాడ్ న్యూస్ రెండూ వింటారు!
శ్రావణ సోమవారం
ఈ మాసంలో వచ్చే సోమవారాలు దాదాపు అందరూ ఉపవాసాలు ఉంటారు. శివుడికి అభిషేకం చేయడం, పార్వతికి కుంకుమ పూజ చేయడం చేస్తారు.
శ్రావణ మంగళవారాలు
పార్వతి దేవికి మరొక పేరు మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని విశ్వాసం. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. స్త్రీలు తమ మాంగళ్యాన్ని కాపాడమని కోరుతూ మంగళగౌరికి పూజ చేసి ముత్తైదువులకు వాయనం ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెళ్లికాని ఆడపిల్లలతో కూడా శ్రావణ మంగళవారం పూజలు చేయిస్తారు.
శ్రావణ శుక్రవారం
శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యం, అందం, ఐశ్వర్యానికి చిహ్నం. ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడు. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతోపాటూ గ్రహాల అనుకూలతా ఉంటుంది. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసంలో అమ్మవారిని కొలుచుకునేవారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ చేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావిస్తారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజిస్తారు.
Also Read: సౌభాగ్యం, సత్సంతానం కోసం వివాహితలు ఆచరించే నోము ఇది!
శ్రావణ శనివారం
ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ఆరాధన శుభకరం.
ఇలా శ్రావణమాసంలో వచ్చే ప్రతీ రోజు విశేషమైనదిగానే చెప్పుకోవచ్చు. ఈ శ్రావణమాసం శివకేశవులకు అభేదం లేదు అని తెలియజేస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి
Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!
Vastu tips: లాకర్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే దరిద్రం తప్పదు
ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు
Gachibowli Laddu Price: భారీ ధర పలికిన నల్లగొండలోని పాతబస్తీ లడ్డు, ధర ఎంతంటే??
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
/body>