Spirituality: దైవానుగ్రహం పొందాలంటే కఠిన పూజలు అవసరం లేదు
దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటారు. పత్రి, పూలు, పసుపు, కుంకుమ సమర్పిస్తారు. అసలు ఇవి ఎందుకు సమర్పించాలి...ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలైంది...
శ్రీకంఠ శివాచార్యులు అంటే అందరకీ తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో అత్యంత కఠిన పద్ధతిలో సాగే పూజా విధానం, పూజాధికాలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేసింది ఈయనే. శ్రీకంఠుల వారి గురించి స్కాంద పురాణంలో ఉంది.
Also Read: భక్త రామదాసుపై చిన్నచూపేల, ఇకనైన పలకవా రామచంద్రా
గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణీ సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో ముక్తీశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు అంబికాదేవి, సద్యోజాత శివాచార్య. శ్వేతాచార్యులనే గురువు వద్ద విద్యను అభ్యసించారు. నాలుగు వేదాలు చదివారు, ఆగమ, నిర్గమ, మంత్ర, తంత్ర, యోగ, ఉపనిషత్తుల్లో ప్రావీణ్యం గడించారు. అదే సమయంలో వేదవ్యాసుల ఆదేశంతో బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని కూడా ఆయన రాశారు. విద్యాభ్యాసం అనంతరం ఇంటికి తిరిగివచ్చిన శ్రీకంఠులుకి వివాహం చేసి కాశీ వెళ్లాలని తల్లిదండ్రులు ఆశపడితే.... ఆయనేమో భగవంతుని కార్యాన్ని నెరవేర్చేందుకు సన్యాస దీక్ష తీసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పారు. కన్నవారి కోరిక తీర్చేందుకు కాళేశ్వరం క్షేత్రాన్ని వారణాశిగా మార్చి , అక్కడే విశ్వనాథ, అన్నపూర్ణేశ్వరిల దర్శనాన్ని వారికి చేయించారని చెబుతారు.
సన్యాస దీక్ష తీసుకున్న శ్రీ కంఠులు అమర్థగిరి ప్రాంతంలో తీవ్ర తపస్సు చేశారు. అక్కడే ఆయనకు పరమేశ్వర దర్శనమైంది. కఠినమైన తపస్సులు, యజ్ఞ యాగాదులను సంస్కరించే బాధ్యతను కూడా ఆయనకు స్వయంగా పరమేశ్వరుడే అప్పగించాడని చెబుతారు. అందుకే ఆ విషయంపై శ్రీకంఠులు విశేషమైన కృషి చేశారు. దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా పూజాదికాలు నిర్వహించే పద్దతులను ప్రవేశపెట్టారు. దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాల్లాంటి ప్రక్రియలు ప్రారంభించి సామాన్యుడికి భగవంతుడిని దగ్గర చేశారు. ఇంట్లో కూడా సులభంగా భగవంతుడిని ఆరాధించే ప్రక్రియ ప్రారంభించారు శ్రీ కంఠులు.
Also Read: పురాణ కాలంలో మహిళా సాధికారికతకు నిదర్శనం ఈ ఐదుగురు
పూర్వకాలంలో యజ్ఞయాగాదులు కేవలం అగ్రకులాల వారే చేసేవారు. దేవాలయాల్లో పూజలతో పాటూ చివరికి ఇంట్లో పూజలు కూడా కేవలం కొన్ని కులాల వారు మాత్రమే పాటించేవారు. అయితే శ్రీకంఠ శివాచార్యుల వల్ల ఈ రోజు ప్రతి ఇంట్లో నిత్యదిపారాధన చేసుకుంటున్నారు. ప్రతి పండుగను ఇంట్లో జరుపుకుంటున్నారు. కులాలతో సంబంధం లేకుండా పూజలు, వ్రతాలు, నోములు సులభంగా చేసుకుంటున్నారు. భారీ హోమాలు, యజ్ఞాలు పసుపు, కుంకుమ, పూలు, నైవేద్యం, దైవభక్తి ఉంటే చాలు భగవంతుడి కృపకు పాత్రులం కావొచ్చని దైవారాధన సులభతరం చేశారు.
Also Read: సెల్ప్ రెస్పెక్ట్ కి ఇంతకన్నా నిదర్శనం ఎవరుంటారు, అందుకే ఆమె తరతరాలకు ఆదర్శం