News
News
X

Spirituality: దోష నివారణ, జ్ఞాన సముపార్జన, సౌభాగ్యం - ఒక్కో హారతిని దర్శిస్తే ఒక్కో ఫలితం

Spirituality: పెద్ద పెద్ద ఆలయాల్లో, భారీ హోమాలు పూజలు చేసే సమయంలో రకరకాల హారతులు ఇవ్వడం చూస్తుంటారు. హారతులన్నీ ఒకటే ఫలితాన్నిస్తాయనుకుంటే పొరపాటే...

FOLLOW US: 
 
Spirituality:  హారతులు మొత్తం 108 రకాలు అని ఋగ్వేదంలో ఉంది. ఒక జ్యోతి మొదలు 108 జ్యోతుల వరకూ హారతులు లెక్కవేస్తారు. ప్రతిదానికీ కూడా నిర్దిష్ట ఫలితాన్ని, నిర్ధిష్ఠ మంత్రాన్ని నిర్ధేశించడం జరిగింది.. 108 ని అష్టోత్తర హారతి అని పిలుస్తారు. ఓంకారహారతితో మొదలవుతుంది. జీవుడిని పరమాత్మవైపు నడిపించే కాగడానే హారతి. పూర్వకాలంలో పెళ్లిళ్లు జరిగేటప్పుడు, దేవాలయాల్లో దివిటీలు పట్టుకునేవారు...అది ఓంకార హారతి అని అంటారు.

ఏ హారతి ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే...

ఓంకార హారతి
సృష్టికి మూలం ఓంకారం. అమ్మవారిని సృష్టి స్వరూపిణిగా పిలుస్తారు. ఓంకార నాదాన్ని వినడం, ఓంకార రూపాన్ని చూడటం వల్ల పాపాలు తొలగిపోవడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే మొదటగా ఓంకార హారతి  ఇస్తారు.

నాగ హారతి
దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల సంతాన సౌభాగ్యం పొందుతారు, రోగనివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. అజ్ఞానం నశించి జ్ఞానం కలుగుతుంది. నాగదోషం ఉన్న వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడటం వల్ల సకల ఆ దోషం పోతుందంటారు.

News Reels

Also Read: అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయి, అవి దేనికి సంకేతం!

పంచ హారతి
సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతి రూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తాయి. పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. దుర్గా మల్లేశ్వరస్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం.అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. అందుకే పంచహారతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

కుంభహారతి
సమాజానికి రక్షను కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభ హారతిని దర్శించడం వల్ల భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచ భూతాత్మకమైన జీవ రక్ష లభిస్తుంది. కుంభ హారతిని ఒక్కసారి చూస్తే చాలు మనసులో ఉన్న గందరగోళాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

సింహ హారతి
దుర్గామాత అమ్మవారి వాహనం సింహం. శత్రువులను శిక్షించి, ధర్మాన్ని రక్షించే తత్వానికి, ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహ హారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. మనిషిలో ఉన్న అసుర ప్రవృత్తి తొలగి సద్భావం పెంపొందుతుంది.

నంది హారతి
ఈశ్వరుని వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. ప్రథమ గణాల్లో ఒకడు నంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం. ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి సకల ధర్మాచరణ అనే ఫల ప్రాప్తి అందిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో జ్ఞానత్వం లభిస్తుంది.

Also Read: కార్తీకమాసం ఎందుకంత ప్రత్యేకం, ఈ నెలరోజులూ ఏం చేయాలి - ఏం చేయకూడదు!

సూర్య హారతి
సూర్య హారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనివల్ల ఆయుష్షు పెరుగుతుంది. సూర్య హారతి సందర్శించుకుంటే అనారోగ్యం తొలగిపోతుంది.

చంద్ర హారతి
మనస్సును ప్రభావితం చేస్తాడు చంద్రుడు. చంద్ర హారతి దర్శనం వల్ల భక్తుల్లో పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణం వృద్ధి చెందుతాయి. మనస్సుకు స్వచ్ఛత చేకూరడంతోపాటు ప్రశాంతత కలుగుతుంది.

నక్షత్ర హారతి
27 నక్షత్రాల్లోనే కోట్ల మంది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలుమూలం. నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది. 

 ఏ హారతి దర్శించుకున్నా పుణ్యఫలమే....

Published at : 22 Oct 2022 06:20 AM (IST) Tags: Spirituality nakshatra harathi Sarpa Harati and Different Types Of Aarti

సంబంధిత కథనాలు

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Horoscope Today 3rd December 2022: ఈ రాశివారు ధీమా వీడకపోతే వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd  December 2022:  ఈ రాశివారు ధీమా వీడకపోతే  వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.