అన్వేషించండి

Spirituality: జుట్టు విరబోసుకుని తిరుగుతున్నారా, అసలు జడ ఎందుకు వేసుకోవాలో తెలుసా!

ఇప్పుడంటే జుట్టు విరబోసుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది కానీ అప్పట్లో జుట్టు విరబోసుకోవడం అంటే అపచారం, అశుభానికి సంకేతం. అసలు జడ ఎందుకు వేసుకునేవారు, జడ వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా..

నడుముదాటి జడ అల్లుకున్న అమ్మాయిని చూసి ముచ్చటపడని మగవారుంటారా? సంచెడు డబ్బులతో కానిపని...గుప్పెడు మల్లెపూలతో అవుతుందన్న సామెత కూడా జడను చూసే పుట్టుకొచ్చిందేమో. అయితే ఇప్పటి జనరేషన్లో అసలు జడ వేస్తున్న వారెంతమంది ఉన్నారు ? . జుట్టుని చిన్నగా కట్ చేసుకుని క్లిప్పో, రబ్బరు బ్యాండో పెట్టి వదిలేస్తున్నారు. లేదంటే కట్ చేసి పోనీ టైల్ అంటున్నారు. దాదాపు 70% అమ్మాయిలైతే జుట్టు విరబోసుకునే తిరుగుతున్నారు. చివరకు పెళ్లిళ్లలో కూడా వాలు జడల ప్లేస్ లో  రెడీమేడ్ జడలు వచ్చి చేరాయి. అసలు జడ ఎందుకు వేస్తారో తెలుసా. 

సాధారణంగా జడని మూడు రకాలుగా వేసుకునేవారు...
 1.రెండు జడలు వేసుకోవడం  2.ఒక జడ వేసుకోవడం 3.ముడి పెట్టుకోవడం

  • జుట్టుని నచ్చినట్టు జడ వేసుకోవడం కాదు...వయసుని బట్టి అల్లుకునేవారు
  • ఆడపిల్లలు రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్న పిల్ల అని, పెళ్లి కాలేదని అర్ధం. ఆ అమ్మాయిలో జీవేశ్వర సంబంధం విడి విడిగా ఉందని అర్థం
  • పెళ్లైన మహిళలు మొత్తం జుట్టుని ఒకటే జడగా వేసుకునే వారు. అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం
  • జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుందంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం
  • ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా.. చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలు గా విడతీసి త్రివేణీసంగమం లా కలుపుతూ అల్లేవారు. ఈ మూడు పాయలకు రకరకాల అర్ధాలు చెబుతారు పెద్దలు.

                1.  తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం 

                2. సత్వ, రజ, తమో గుణాలు 

                3.జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అన్న అర్ధాలు కూడా ఉన్నాయంటారు. 

అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు పెళ్లైన వారా, పెళ్లికానివారా, పిల్లలు ఉన్నారా-లేరా అనే విషయం తెలిసిపోయేది. హిందువులు పాటించే ప్రతి పద్ధతిలో ఇంత అర్థం ఉంది కాబట్టే మన సంస్కృతి సంప్రదాయాలపై విదేశీయులకు మక్కువ పెరుగుతోంది.  

Also Read: ఆ దేవాలయాల్లో మటన్, చికెన్ బిర్యానీ, చేపలు ప్రసాదాలు

జుట్టు విరబోసుకుంటే
జుట్టు విరబోసుకుంటే పిశాచాలకు ఆహ్వానం పలకడమే అంటారు పండితులు. తలకి స్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరేలోగా కనీసం చివర్లైనా ముడివేయాలంటారు. జుట్టు విరబోసుకుని, క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళ్లారాదంటారు. అలా చేస్తే జ్యేష్టా దేవి మీ వెంటే ఉంటుందట. మరి దేవతా ప్రతిమల్లో అమ్మవారు జుట్టు విరబోసుకుని ఉంటారెందుకు అనే క్వశ్చన్ రావొచ్చు... దానికి సమాధానం ఏంటంటే..ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపం. సత్వ,రజో,తమో గుణాలు ఆమెలో ఉండవు.  అమ్మవారు కామాన్ని హరించేది..అందుకే దేవతలకు ఈ నియమం వర్తించదు. 

Also Read:  పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
OnePlus 13: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లుకేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
OnePlus 13: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Embed widget