News
News
X

Spirituality: ఏంటి బంటి? ఎవరు చూస్తారులే అనుకుంటివా, వీళ్లతో కాస్త జాగ్రత్త

చుట్టూ ఎవరూ లేనప్పుడు మీరు ఎలా ఉంటారో అదే మీరు. మరి ఆ సమయంలో ఏం చేసినా ఎవ్వరూ చూడలేదు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఎవరు ఏం చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి.

FOLLOW US: 

నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!
పంచభూతాల సాక్షిగా...పంచభూతేషు(పరమేశ్వరుడు) సాక్షిగా
పాఠం చెబుతది పాపం పండిన రోజున

ఇది ఓ సినిమాలో పాట. కానీ ఆలోచిస్తే ఇందులో ప్రతి మాటా నిజమే కదా అనిపిస్తుంది. చుట్టూ ఎవరూ లేరు, నన్ను ఎవ్వరూ చూడడం లేదు నేను ఏమైనా చేయొచ్చనుకుంటే పొరపాటే. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి .

ఇవే ఆ 18 సాక్షులు
నాలుగు వేదాలు ( సామవేదం, ‎ఋగ్వేదం , ‎అథర్వణ వేదం, ‎యజుర్వేదం)
పంచభూతాలు ( భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం)
అంతరాత్మ
ధర్మం
యముడు
ఉభయ సంధ్యలు ( సూర్యోదయం, సూర్యాస్తమయం)
సూర్య చంద్రులు
పగలు, రాత్రి

Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
వీటిని అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఏ న్యాయస్థానంలోనూ సాక్ష్యం చెప్పకపోవచ్చు కానీ వీటినుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి న్యాయదేవతను మోసం చేయొచ్చు కానీ వీటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కానేకాదు. ఇది గుర్తించలేక, ఇవన్నీ జడపదార్థాలే కదా అనే భ్రమలో ఉంటున్నారు. కానీ మన ప్రతి చర్యని అవి నమోదు చేస్తుంటాయని, నిత్యం మన నివేదికల్ని విధికి చేరుస్తాయి..అవే కర్మలుగా మారతాయని గుర్తించలేకపోతున్నాం. 

సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!  
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే! 
అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!! 

Also Read: శివరాత్రి గురించి పార్వతికి శంకరుడు చెప్పిన కథ ఇదే
మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. వాటికి తగ్గట్టే కర్మ ఫలం ఉంటుంది. గత జన్మలో పాప పుణ్యాలు ఈ జన్మలో, ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు వచ్చే జన్మలో అమలవుతాయనే భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు..కలియుగంలో  ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు వెంటనే ఫలితం  చూపించేస్తున్నాయ్. జరిమానాలు అమలైపోతున్నాయ్. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం. 

అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి ఒక్కరికీ తెలుసు . అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను పక్కన పెట్టడమే ఎన్నో అనర్థాలకు కారణం అవుతోంది. నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .ఈ స్పృహ మీలో ఉన్నప్పుడు తప్పొప్పులు ఏం చేసినా అందుకు తగిన ఫలితం పొందేందుకు సిద్ధంగా ఉండండి. మంచి చేసేందుకు ప్రయత్నించండి లేదా..మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి. 

"కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ" 

Published at : 16 Feb 2022 01:18 PM (IST) Tags: Spirituality Karma what is karma karma and spirituality theory of karma karma yoga deaf spirituality laws of karma karma spiritual meaning how karma works meaning of karma spiritual meaning of karma

సంబంధిత కథనాలు

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

Horoscope Today 27th September 2022: మేషం, సింహం సహా ఈ రాశులవారిపై బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Horoscope Today 27th September 2022: మేషం, సింహం సహా ఈ రాశులవారిపై బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Brihadeeshwara Temple: ఈ ఆలయం నీడ నేల మీద పడదు, హీరో విక్రమ్ చెప్పిన ఆ ‘అద్భుత’ దేవాలయం ఇదే!

Brihadeeshwara Temple: ఈ ఆలయం నీడ నేల మీద పడదు, హీరో విక్రమ్ చెప్పిన ఆ ‘అద్భుత’ దేవాలయం ఇదే!

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

టాప్ స్టోరీస్

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Kcr Reservation Politics : రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

Kcr Reservation Politics :    రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా  జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?