News
News
వీడియోలు ఆటలు
X

Significance of 786 In Islam: 786 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి - ముస్లింలు ఆ సంఖ్యను అంతగా ఎందుకు ఆరాధిస్తారు!

786 సంఖ్యను మహమదీయులు ఎంతో పవిత్రమైనదిగా, ఏంతో అదృష్ట దాయకమైనది గా భావిస్తారు . ఇప్పుడు ముస్లింలతో పాటూ ఈ నంబర్ ఇతర ధర్మాల వారికి కూడాపాకింది.ఇంతకీ ఈ సంఖ్య వెనుకున్న గొప్పతనం ఏంటి...

FOLLOW US: 
Share:

Significance of 786 Number In Islam: మనదేశంలో అన్ని మతాలకు సముచిత స్థానం ఉంది. ఆయా మతాల వారు పాటించే సెంటిమెంట్స్ వేరు. హిందువులకు అష్టాదశ పురాణాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఏడుకొండలు అంటూ ఒక్కో నంబర్ సెంటిమెంట్ ఉన్నట్టే మహమ్మదీయులకు కూడా 786 నంబర్ సెంటిమెంట్. ఇంకా చెప్పాలంటే అల్లాకు సరిసమానమైన నంబర్ గా భావిస్తారు.

పవిత్ర వాక్యం రాసేందుకు ఉపయోగపడే నంబర్

అబ్జాద్ అని పిలిచే పురాతన అరబిక్ సంఖ్యా శాస్త్రం ప్రకారం…. ఈ సంఖ్య ఉద్భవించిందని తార్కికులు చెబుతారు. అబ్జాద్…సంఖ్యాశాస్త్రం ప్రకారం… 5వ శతాబ్దంలో పుట్టిన అరబిక్ భాషలో మొత్తం ఇరవై ఎనిమిది అక్షరాలు ఉంటాయి… ఆ భాషలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కో నంబర్ ఇవ్వడం జరిగింది.  ఆ నంబర్లనీ లెక్కిస్తే 786 పుట్టిందని వారి నమ్మకం. అదే ఖురాన్ ప్రారంభంలో ఉండే వాక్యం

'బిస్మిల్లాహ్ ఇర్ రహమాన్ ఇర్ రహీమ్' ("బిస్మిల్లాహ్ అల్-రహ్మాన్ అల్-రహీం ")

"అల్లాహ్, ఓహ్ దయగల వాడా , ఓహ్ కరుణామయుడా " మాకు మంచిజరిగేలా దీవించు అని అర్థం.  ప్రతి పనిని ఆరంభించే ముందు దీనిని తలుచుకుంటే మంచి జరుగుతుంది అని వారు భావిస్తారు. ఈ పవిత్ర వ్యాఖ్య రాయడానికి ఉపయోగించే అక్షరాల విలువలను కలిపితే ఈ 786 సంఖ్య వస్తుంది.

ఆ వాక్యం ఇలా అంకెల్లోకి ఎలా మారింది

ఆ వాక్యంలోని ప్రతి అక్షరానికి ఓ సాంఖ్యక విలువ ఉంటుంది. ఆ విలువ మొత్తాన్ని కూడితే 786 అవుతుంది. అబ్జాద్ అంకెల వ్యవస్ధను వినియోగించి మరి ఆ అక్షరాలకు ఆ విలువ ఇచ్చారు. వారి వర్ణమాలలో మొదటి 9 అక్షరాలకు 1–9 విలువలు , తరువాతి 9 అక్షరాలకు 10–90 విలువ ఇచ్చారు.

అలీఫ్ - 1, బా - 2, జీమ్ - 3, దాల్ - 4, హా (చిన్న) - 5, వా - 6, జా - 7, హా (పెద్ద) - 8, తౌ - 9

యా - 10, కాఫ్ - 20, లామ్ - 30, మీమ్ - 40, నూన్ - 50, సీన్ - 60, అయిన్ - 70, ఫా - 80, సౌద్ - 90

క్వాఫ్ - 100, రా - 200, షీన్ - 300, తా - 400, థా - 500, ఖా - 600, థాల్ - 700, ధౌద్ - 800, థౌ - 900, ఘైన్ - 1000

అలా ఈ వాక్యంలో ఉన్న ప్రతి అక్షరానికి ఈ విలువలు వస్తున్నాయి

బా = 2, సీన్ = 60 మీమ్ = 40 అలీఫ్ = 1 లామ్ = 30  హా (చిన్న) = 5, అలీఫ్ = 1, లామ్ = 30; రా = 200, హా (పెద్ద) = 8, మీమ్ = 40, నూన్ = 50, అలీఫ్ = 1, లామ్ = 30, రా = 200, హా (పెద్ద) = 8, యా = 10, మీమ్ = 40

ఈ నంబర్లో ఇచ్చిన విలువల ప్రకారం 'బిస్మిల్లాహ్ ఇర్ రహమాన్ ఇర్ రహీమ్' వాక్యాలకు వచ్చిన నంబర్లనీ కలిపితే 786 వస్తుంది. అలా  786 ఇస్లామీయులకు ప్రత్యేమైన నంబర్ గా మారింది.

Also Read: పంచతంత్రంతో విజయ రహస్యం

ఈ పవిత్ర సంఖ్యకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత

ఇంత గొప్ప పవిత్రమైన సంఖ్యకు ప్రపంచ దేశాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో కూడా ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏసియా లో మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కరెన్సీ నోట్లపై ఈ సీరియల్ నంబర్ ఉన్న ‘786’ నోట్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. నిర్దిష్ట క్రమంలో కనిపించే ఈ మూడు అంకెలు నోటుతో లక్షలు సంపాదించేవారున్నారు. ఇస్లాం అనుసరించే వారు 786 సంఖ్యను శుభప్రదంగా పరిగణిస్తారు కనుక ఈ సీరియల్ నెంబర్ తో ఉన్న నోటు దొరికితే దాన్ని ఆన్ లైన్ లో వేలం వేయడం ద్వారా అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం, eBay లాంటి మరికొన్ని ఇ-కామర్స్ వెబ్ సైట్లలో ప్రత్యేకమైన కరెన్సీ నోట్లు, నాణేలను అమ్మడానికి, కొనుగోలు చేయడానికి అనుమతులు ఉన్నాయి. కొందరు ఇలాంటి అరుదైన నోట్లను సోషల్ మీడియా వేదికగాను అమ్ముతున్నారు కూడా. 

Also Read: మే మూడో వారంలో ఈ రాశులవారికి ఆస్తి ప్రయోజనాలున్నాయి, మే 15 నుంచి 21 వరకూ వారఫలాలు

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.

Published at : 14 May 2023 03:59 PM (IST) Tags: Significance of 786 number Importance of 786 number Specialty of 786 number in islam

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా