Eating Rules In Shastra: వారంలో 7 రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఏం తింటే మంచిది
Eating Rules In Shastra: మనం ఇంటి నుంచి బయటకు వెళ్లి చేసే పనులు విజయవంతం అయ్యేందుకు అనేక పరిష్కారాలు సూచించారు. ఒక్కో రోజు ఒక్కొక్క పరిష్కారం ద్వారా పనుల్లో విజయం సాధించవచ్చు.
Eating Rules In Shastra: వారంలోని 7 రోజులలో ప్రతి ఒక్క రోజు ఒక్కో దేవునికి అంకితం చేశారు. అందువల్ల వారంలోని ప్రతి రోజు మన జీవితాలపై ప్రభావం చూపుతుంది. కొందరికి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రతిరోజూ దేవుడికి నమస్కరించే సంప్రదాయం ఉంటుంది. ఇది మంచి పనే అయినప్పటికీ, ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని పదార్థాలు తినడం వల్ల మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయంతో మంచి ఫలితాలు వస్తాయి. వారంలో 7 రోజులు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏం తినాలి..?
ఆదివారం
శాస్త్రం ప్రకారం, మీరు ఆదివారం ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళుతున్నట్లయితే, ఇంటి నుంచి బయలుదేరే ముందు తమలపాకు తినండి. ఇలా చేయడం వల్ల ఆ పనిలో విజయం సాధిస్తారు. ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని పెద్దలు చెబుతారు.
సోమవారం
శాస్త్రం ప్రకారం, మీరు సోమవారం ఏదైనా ప్రత్యేక పని కోసం వెళుతుంటే, ఇంటి నుంచి బయలుదేరే ముందు, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇలా చేయడం ద్వారా, మీరు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత చేసే ఏ పనిలో అయినా సులభంగా విజయం సాధిస్తారు.
మంగళవారం
మంగళవారం నాడు ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికి వెళితే శాస్త్ర ప్రకారం చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోండి. ఇది మీ పనిలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇలా చేయడం వల్ల అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి అవుతాయి.
బుధవారం
మీ పని చాలా కాలంగా నిలిచిపోయి, బుధవారం నాడు పూర్తి చేయబోతున్నట్లయితే, ఇంట్లో ఉంచిన కొన్ని పచ్చి కొత్తిమీర ఆకులను తినండి, మీరు మంచి ఫలితాలను పొందుతారు.
గురువారం
మీరు గురువారం నాడు కొన్ని ప్రత్యేక పనిని పూర్తి చేయడానికి ఇంటి నుం^èþఢ బయలుదేరినట్లయితే, శాస్త్రం ప్రకారం, కొద్దిగా జీలకర్ర తినండి. తద్వారా మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.
శుక్రవారం
శుక్రవారం ఏదైనా పనిపై ఇంటి నుంచి బయటకు వెళితే వెళ్లే ముందు పెరుగు, పంచదార తినాలి. ఇలా చేయడం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.
Also Read : భోజనానికి ముందు ప్లేటు చుట్టూ నీళ్లు ఎందుకు చల్లాలి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
శనివారం
మీరు శనివారం ఏదైనా పని మీద బయటకు వెళుతుంటే, ఖచ్చితంగా అల్లం ముక్క తినండి. ఈ పరిష్కారంతో, మీరు ఆ పనిలో విజయం పొందవచ్చు.
Also Read : కంచంలో చేయి కడుతున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.