అన్వేషించండి

Navaratri 3rd day: శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అన్నపూర్ణ దేవిగా కనకదుర్గ - పూజా విధానం, విశిష్టత తెలుసుకోండి!

Annapurna Devi Alankaram Today: శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తోంది దుర్గమ్మ . ఈ రోజు ఈ ఒక్క శ్లోకాన్ని పఠిస్తే జీవితంలో అన్నానికి లోటుండదు!

Navaratri Day 3 Annapurna Devi:  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి, రెండో రోజు గాయత్రి అమ్మవారి అలంకారంలో కనిపించిన దుర్గమ్మ..మూడో రోజైన సెప్టెంబర్ 24 బుధవారం అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. 

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరగ్య సధ్ధ్యర్థం. భిక్షాం దేహిచ పార్వతి
మాత చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర:
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్

శరన్నవరాత్రి మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ తృతీయ రోజు అన్నపూర్ణ అలంకారం వేస్తారు. అన్నపూర్ణాదేవిని ఆహార దేవతగా పూజిస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం దారిద్ర్యాన్ని దూరం చేస్తుందని భక్తులవిశ్వాసం. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ  ఆకలిదప్పులను దూరం చేస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణను దర్శించుకుంటే ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని నమ్మకం. జీవుల ఆకలి తీర్చడాన్ని మించినది ఇంకే లేదని చెప్పడమే ఈ అలంకారం వెనుకున్న పరమార్థం.  ఈ రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత సొంతమవుతుంది.
 
ఈ రోజు అన్నపూర్ణా దేవికి గంధం లేదా పసుపురంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగు ఇచ్చేందుకు ప్రతీక అని చెబుతారు. అన్నపూర్ణమ్మకి గారెలు, క్షీరాన్నం, దధ్ద్యోజనం నివేదిస్తారు. 

అన్నపూర్ణ అలంకారం సందర్భంగా...ఆది శంకరాచార్యులవారు రచించిన అన్నపూర్ణాష్టకం పారాయణం చేయాలి.  

శ్రీ అన్నపూర్ణేశ్వరీ  అష్టకం (Sri Annapurna Ashtakam )

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ||  
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ||

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 దసరా నవరాత్రి కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత! ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకునేందుకు...ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget