Tirumala : తిరుమలలో మహాశాంతి హోమం..హోమాలతో దోషాలుపోతాయా - యజ్ఞం, యాగం, హోమం మధ్య వ్యత్యాసం ఏంటి !
TTD On Homam Laddu Prasadam: తిరుమలలో మహాశాంతి హోమం ముగిసింది. ఇకపై లడ్డూ ప్రసాదంపై భక్తులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఇంతకీ హోమాలు చేస్తే దోషాలు తొలగిపోతాయా?
TTD On Shanthi Homam Laddu Prasadam: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశం మొత్తం పెద్ద దుమారమే రేపింది. కేంద్రంలో పెద్దల నుంచి సామాన్య భక్తుల వరకూ శ్రీవారి సన్నిధిలో జరిగిన అపచారానికి లెంపలేసుకున్నారు. ఇంత ఘోరమా అని వాపోయారు. ఈ క్రమంలో శ్రీవారి సన్నిధిలో మహాశాంతి హోమం నిర్వహించింది టీటీడీ. హోమం పూర్తైన తర్వాత టీటీడీ ఈవో జే శ్యామలరావు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కీలక ప్రకటన చేశారు. ఇకపై భక్తులకు లడ్డూ ప్రసాదంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. తిరులలో పవిత్రోత్సవాల కన్నా ముందే లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని మార్చినట్టు తెలిపారు. తిరుమల ప్రసాదాల తయారీ కేంద్రాల్లో సంప్రోక్షణతో దోషం తొలగిపోయిందని.. శాంతిహోమం, పూర్ణాహుతితో సకల దోషాలు తొలగిపోయాయని..ఇకపై భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
హోమం - యాగం- యజ్ఞం..ఈ మూడింటి మధ్యా వ్యత్యాసం ఏంటి?
ఇవన్నీ చేస్తే దోషాలు తొలగిపోతాయా?
హోమం
యజమాని సౌలభ్యం కోసం చేసుకునేది. తన పేరు, గోత్రం పేరుతో వ్యక్తిగత జీవితం, కుటంబ సంతోషం కోసం నిర్వహిస్తారు. ఇందులో భాగమే గణపతి హోమం, లక్ష్మీహోమం, నవగ్రహహోమం.
యాగం
యాగం అంటే యజమాని బ్రహ్మస్థానంలో కూర్చుంటాడు..మొత్తం చేసేది తనే..కానీ అదంతా లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తాడు. అంటే యాజనం చేసేది, ఖర్చు చేసిది మొత్తం యజమానే..కానీ అందులో తన స్వలాభం ఉండదు. కష్టం తనది..ఫలితం వ్యవస్థది.
యజ్ఞం
యజ్ఞం అంటే దీనికి యజమాని ఉండడు..కర్మపై ఎలాంటి ఆపేక్ష లేని రుషులంతా లోకం బావుండడం కోసం చేసేదే యజ్ఞం. దీనికి సంకల్పం ఉండదు.. ఇదో నిరంతర ప్రక్రియ. పకృతిని చల్లబర్చేందుకు , దేవతల సంతోషం కోసం , పంచభూతాలు ప్రశాంతంగా ఉండాలని, ప్రజల సంతోషం కోసం, మంచి పాలన కోసం యజ్ఞం చేస్తారు. ఎవరి మంచిని అయితే కోరుకుంటారో..వారితో యజ్ఞం చేసేవారికి ఎలాంటి భౌతిక సంబంధాలు ఉండవు..అందరి బాగుకోసం యజ్ఞం చేస్తారు..
Also Read: తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!
ఓవరాల్ గా చెప్పుకోవాలంటే యజ్ఞాల నుంచి యాగాలు...
యాగాల నుంచి హోమాలు ఉద్భవించాయి
సహయజ్ఞాః ప్రజాః సృష్టా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమ్ ఏషవో స్తిష్ట కామధుక్
‘యజ్ఞం’ గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. ఆహారానికి కారణం వర్షం.. వర్షానికి కారణం యజ్ఞం.. అందుకే యజ్ఞం సర్వశ్రేష్ఠమైన కర్మ. యజ్ఞంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు.
యజ్ఞం, యాగం, హోమం వల్ల ఉపయోగం ఏంటి!
యజ్ఞగుండం నుంచి వచ్చే పొగ వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి గాలిలో స్వచ్ఛత పెంచుతుంది. అతివృష్టి, అనావృష్టి అనే మాటే వినిపించదు. యజ్ఞ యాగాదులు హోమాలు నిర్వహించే ప్రదేశాల్లో అంటు వ్యాధులు వ్యాపించవు. గాలిలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.
హోమంలో భస్మంతో ఔషధాలు తయారు చేస్తారు.. ఆ భస్మాన్ని పంటపొలాల్లో చల్లితే మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది
అందుకే యజ్ఞం, యాగం, హోమం దేవుడికోసం కాదు మనకోసం అన్నది గుర్తించాలంటారు వేదపండితులు.
Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!