Pranahita Pushkaralu 2022: రాష్ట్రం విడిపోయాక తొలిసారి తెలంగాణలో ప్రాణహితకు పుష్కర శోభ
ప్రతి పన్నెండేళ్లకోసారి భారతదేశంలో 12 ముఖ్యమైన నదులకు 'పుష్కరాలు' జరుగుతాయి. ఈ సమయంలో ఆయా నదుల్లో స్నానమాచరిస్తే మంచిదని చెబుతారు. ఈ ఏడాది తెలంగాణలో ఉన్న ప్రాణహిత నదీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
ప్రాణహిత పుష్కరాలు ( Pranahita Pushkaralu 2022)
బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో ప్రాణహిత నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు అంటే ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమైన పుష్కరాలు 12 రోజుల పాటూ ఏప్రిల్ 24 వరకూ జరగనున్నాయి.
జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది, నాగరికత విస్తరించింది. అలాంటి నీటిని దేవతగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అందుకే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్రస్నానాలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనలోనూ దైవ దర్శనానికి ముందు అక్కడున్న నదుల్లో స్నానమాచరిస్తుంటారు. ఇంకా శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే. అయితే నదీస్నానం పుణ్యప్రదం అని భావించే హిందువులు ... పుష్కర స్నానం మరింత మంచిదని విశ్వసిస్తారు.
Also Read: ఈ వారం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంది, మీరున్నారా ఇందులో తెలుసుకోండి
తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం...
బ్రహ్మ నుంచి ఆకాశం
ఆకాశం నుంచి వాయువు
వాయువు నుంచి జలం
జలం నుంచి భూమి
భూమి నుంచి ఔషధులు
ఔషధుల నుంచి అన్నం
అన్నం నుంచి జీవుడు పుట్టాయని వివరిస్తుంది
పుష్కరుడు ఎవరు
పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం ద్వారా పాపాలు పోగొట్టుకుంటున్నామని మానవులు భావిస్తే... ఆ పాపాలు స్వీకరించి అపవిత్రులం అవుతున్నాం అని నదులు బాధపడ్డాయట. అప్పుడు పుష్కరుడు అనే వ్యక్తి బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొంది తనను ఓ పవిత్రక్షేత్రంగా మార్చమని కోరుకున్నాడట. ఇలా పుష్కరుడు తీర్థంగా మారి స్వర్గలోకంలో ఉన్న మందాకినీ నదిలో ఉన్నాడట. వాయుపురాణం ప్రకారం బ్రహ్మ వరం పొందిన పుష్కరుడు ఆయా నదులకు వచ్చినప్పుడు సప్త రుషులు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని , వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక ఆ 12 రోజులు అత్యత పవిత్రమైనదిగా భావిస్తారు.
Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు
గురుగ్రహం అంటే బృహస్పతి (దేవతల గురువు)
గురుగ్రహం మేష రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు గంగానదికీ, కన్యారాశికి వచ్చినప్పుడు కృష్ణా నదికీ, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికీ, అలాగే మరికొన్ని నదులకూ పుష్కరాల ఉత్సవాలు జరుగుతాయి. పుష్కరాలు ప్రారంభమైన మొదటి పన్నెండు రోజులు పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాలివ్వడానికి మంచి సమయం.
ఇక ప్రాణహిత నది విషయానికొస్తే గోదావరికి అతిపెద్ద ఉపనది.కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఇక్కడే ఏప్రిల్ 13 మధ్యాహ్నం పుష్కరుడిని ఆహ్వానిస్తారు.