Panchang 26June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యుడి మంత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
![Panchang 26June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యుడి మంత్రం Panchang 26 June 2022: Sunday Panchang, Surya Mantra , Shri Suryanarayan Aradhna Panchang 26June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యుడి మంత్రం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/0ee79545076e65633f7a6e4f49f43487_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జూన్ 26 ఆదివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 26- 06 - 2022
వారం: ఆదివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం
తిథి : త్రయోదశి ఆదివారం రాత్రి తెల్లవారుజామున 3.00 గంటల వరకూ తదుపరి చతుర్థశి
వారం : ఆదివారం
నక్షత్రం: కృత్తిక 11.49 వరకు తదుపరి రోహిణి
వర్జ్యం : రాత్రి 12.53 నుంచి 2.37 వరకు తిరిగి రాత్రి 8.55 నుంచి 10.34
దుర్ముహూర్తం : ఉదయం 7.14 వరకు
అమృతఘడియలు : ఉదయం 6.51 నుంచి 8.30 వరకు
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:33
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఈ రాశులవారు సలహాలివ్వడంలో ది బెస్ట్, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఆదివారం సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యున్ని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందడమే కాదు..జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సూర్యారాధన ద్వారా ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిత్యం సూర్యుని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
సూర్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండుడు, మిత్రుడు.. ఇలా ఎన్నో నామాలు. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమని, కర్మ సాక్షి అని అంటారు. సూర్యుడు నమస్కార ప్రియుడు కదా అందుకే భక్తిగా చేతులుజోడిస్తే చాలు.
శ్రీ సూర్య నమస్కార మంత్రం (Surya Namaskar Mantra in Telugu)
ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||
ఓం మిత్రాయ నమః | 1 |
ఓం రవయే నమః | 2 |
ఓం సూర్యాయ నమః | 3 |
ఓం భానవే నమః | 4 |
ఓం ఖగాయ నమః | 5 |
ఓం పూష్ణే నమః | 6 |
ఓం హిరణ్యగర్భాయ నమః | 7 |
ఓం మరీచయే నమః | 8 |
ఓం ఆదిత్యాయ నమః | 9 |
ఓం సవిత్రే నమః | 10 |
ఓం అర్కాయ నమః | 11 |
ఓం భాస్కరాయ నమః | 12 |
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే |
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ||
ఇతి శ్రీ సూర్య నమస్కార మంత్రం సంపూర్ణం ||
సూర్య గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే|
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్||
Also Read: జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)