అన్వేషించండి

Onam Celebrations: ప్రతీ రోజూ ఒక ప్రత్యేక ఉత్సవం - పదిరోజుల ఓనం పండుగ జరిగే తీరిదే

Onam Celebrations: కేరళ పండుగలు అనగానే గుర్తొచ్చే పండుగ ఓనం. కేరళీయులు ప్రతిష్టాత్మకంగా పదిరోజులు జరుపుకునే ఈ పండుగలో ప్రతీ రోజూ ఒక ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది.

Onam Celebrations 2024: మళయాళీల పండగల్లో ముఖ్యమయిన వాటిలో ఒకటి ఓనం పండుగ. ఇది పదిరోజుల పాటు జరిగే పండుగ. మళయాళీ హిందువులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ఇది బలిచక్రవర్తి విజయానికి, వామనావతారాన్ని స్మరించుకునే సందర్భంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాలీలందరూ  ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

ఈ పది రోజుల ఓనం ఉత్సవాలు జరుపుకునే విధానాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మొదటి రోజు

 ఓనం పండుగ ప్రారంభించే రోజును అథం అంటారు. అందరూ తమ ఇళ్లను శుభ్రం చేసుకుని అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. ఈ రోజున ‘పూకలం’ అనే పూలతో తయారు చేసే రంగోలిని మొదలుపెడతారు. ఈ పూకలం పదిరోజుల పాటు కొనసాగిస్తారు.

రెండో రోజు

తర్వాత చితిరా.  పూకలం మరికాస్త పెద్దదిగా తయారు చేస్తారు. ఈ రోజు నుండి ఇంటిని కూడా  శుభ్రపరిచి అలంకరించడం ప్రారంభిస్తారు. ప్రత్యేక ఆరాధనలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు. ఈ రోజున చక్రవర్తి మహా బలికి ఆహ్వానం పలుకుతారు. పరిమాణం పెరిగి పూకలం రోజురోజుకు పెరిగే ఉత్సహానికి, ఆనందానికి ప్రతీకగా చెప్పవచ్చు.

మూడో రోజు

 మూడో రోజు చోది.  ఈ రోజున కొత్త వస్త్రాలు, బహుమతులు కొంటారు. ప్రత్యేకంగా సంప్రదాయ దుస్తులు ధరించి ఆట పాటలతో ఆనందిస్తారు. పూకలాన్ని మరింత విస్తారంగా చేస్తారు.

నాలుగో రోజు

నాలుగో రోజు విశాఖం. ఈ రోజున పెద్ద పూకలం తయారు చేయడంతో  పండుగ సంరంభం పూర్తిస్థాయిలో మొదలవుతుంది. మట్టితో చేసిన మహాబలి బొమ్మలను ప్రాంగణాల్లో నెలకొలుపుతారు. మహా బలిని సంప్రదాయబద్ధంగా ఆహ్వానిస్తారు. మహా బలి దానధర్మాలకు ప్రతీకగా భావిస్తారని అందరికీ తెలుసు.

ఐదో రోజు

ఐదవ రోజు అనిజం. ఈ రోజునే వల్లంకలి అనే పడవల పోటీలు జరుగుతాయి. బృందాలుగా ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటి చూసేందుకు కన్నుల పండువగా ఉంటుంది. పల్లెల్లో ఆటలు, పాటలు మొదలవుతాయి.

ఆరోరోజు

ఆరో రోజు తృక్కెట్ట. వంటకాలు తయారు చేసే ఉత్సాహం మొదలవుతుంది. ఈ రోజు పూకలాన్ని ఇంకా పెద్దదిగా, రంగురంగులుగా తీర్చిదిద్దుతారు.

ఏడవరోజు

ఏడవ రోజు మూలం. కేరళ పల్లేల్లో చేసుకునే జానపద నృత్యాలు, సాంప్రదాయ ఆటలు ఈరోజునే ప్రారంభం అవుతాయి.

ఎనిమిదవ రోజు

ఎనిమిదవ రోజు పూరం.  పూకలం పరిమాణం మరింత పెరుగుతుంది. దీనితో పాటు ఓనం సమీపిస్తుందన్న ఉత్సాహం పెరుగుతుంది. ప్రత్యేకపూజలు కూడా చేస్తారు.

తొమ్మిదో రోజు

తొమ్మిదో రోజును ఉత్రాడం అంటారు. ఈరోజు ఓనం ఉత్సవాల్లో చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. ఓనంచిల్లి, ఓనమ్ ఉత్సవం మొదటి రోజు అని పరిగణిస్తారు. ప్రత్యేక సంప్రదాయ వంటకాలు, మిఠాయిలు తయారు చేస్తారు. అన్నదానం మొదలవుతుంది.

పదవ రోజు

పదవ రోజు తిరువోనం. దీనినే ఓనం ప్రధాన ఉత్సవంగా పరిగణించాలి. కుటుంబంలోని అందరు ఒకచోట చేరి కలసి పండగ జరుపుకుంటారు. ‘ఓనమ్ సద్య’ అనే ప్రత్యేక భోజనాన్నిఈ రోజున ఆరగిస్తారు,  అందరికీ పెడతారు. ఈ పండుగలో పూలతో అలంకరణ, వంటకాలు, ఆటలు, సంగీతం, కేరళ ప్రత్యేక సంప్రదాయ సంబరాలు భాగంగా  ఉంటాయి.

Also Read: సోషల్ మీడియాలో ఓనమ్ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ కోట్స్ పోస్ట్ చేసేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget