Happy Onam 2024 : సోషల్ మీడియాలో ఓనమ్ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఈ కోట్స్ పోస్ట్ చేసేయండి
Happy Onam 2024 Wishes : ఓనం సమయంలో మీ ఫ్రెండ్స్‌కి విష్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్లో ఇలా ఓనం శుభాకాంక్షలు చెప్పేయండి.
![Happy Onam 2024 : సోషల్ మీడియాలో ఓనమ్ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఈ కోట్స్ పోస్ట్ చేసేయండి Happy Onam 2024 Onam wishes Share on WhatsApp Instagram Facebook and other social media platforms Happy Onam 2024 : సోషల్ మీడియాలో ఓనమ్ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఈ కోట్స్ పోస్ట్ చేసేయండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/12/2fc11a0bfd40271b595a401d278ac4871726123796650874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Onam 2024 wishes : ఈ సంవత్సరం ఓనం సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమై.. సెప్టెంబర్ 15న ముగియనుంది. కేరళలో పంటలు, రుతుపవనాల ముగింపునకు గుర్తుగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. పది రోజుల పాటు సాగే ఈ ఉత్సవం అట్టంతో మొదలై చితిరాతో ముగుస్తుంది. చివరి రోజున కుటుంబం, ఫ్రెండ్స్‌తో కలిసి విందు చేసి పండుగను ముగిస్తారు. అయితే ఈ సమయంలో మీ ఫ్రెండ్స్‌కి ఓనమ్ విషెష్‌ను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా చెప్పేయండి.
ఓనమ్ శుభాకాంక్షలు
కేరళలో జరిగే అతిపెద్ద పండుగ ఓనమ్. మహాబలి అనే రాక్షస రాజును ఆహ్వానిస్తూ.. ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. వాటిని రంగురంగుల పూలతో అలంకరిస్తారు. మహాబలి అక్కడి ప్రజల సంతోషాన్ని దగ్గరుండి చూస్తారని నమ్ముతారు. ఈ సందర్భంగా విందుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, ఆటలు, పాటలతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఆగస్ట్- సెప్టెంబర్ సమయంలో వస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 6న మొదలై.. సెప్టెంబర్ 15తో ఇది ముగుస్తుంది. ఈ పండుగ సాంస్కృతిక వారసత్వం, మతపరంగా, ప్రకృతితో మమేకమై.. దాని అనుబంధానికి గుర్తుగా నిలుస్తుంది. ఈ సమయంలో మీ మలయాళీ ఫ్రెండ్స్‌కి ఓనమ్ శుభాకాంక్షలు చెప్పేయండిలా..
- మీరు సంపదలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓనం శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో ఆనందం, శాంతి, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.
- మీకు, మీ కుటుంబంలో ఆనందం, శాంతి, విజయం కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఓనం.
- ఈ రంగుల పువ్వుల వలె మీ లైఫ్ కూడా సంతోషంగా, కలర్ ఫుల్‌గా ఉండాలని కోరుకుంటూ ఓనం శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో కొత్త ఆశలు, కలలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను.
- ఆ మహాబలి రాజు దయ, దాతృత్వం మీకు స్ఫూర్తినివ్వాలని కోరకుంటున్నారు. మీరు అందరికీ ఇలానే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఓనం శుభాకాంక్షలు.
- మీ పంటలకు కొదువ లేకుండా.. మీ ఇంట్లో ప్రేమ వెల్లివిరియాలని కోరుకుంటూ హృదయ పూర్వక ఓనమ్ శుభాకాంక్షలు.
- ఓనం వేడుకలు మీ జీవితంలో సంతోషం, ఆనందాలను నింపాలని కోరుకుంటూ హ్యాపీ ఓనం. మీ ఫ్యామిలీకి కూడా విషెష్ చెప్పండి.
- ఈ ఓనం మీకు ప్రేమ, నవ్వు, అన్ని శుభాలను అందించాలని కోరుకుంటూ ఓనం శుభాకాంక్షలు.
- మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ప్రారంభాలు మొదలవ్వాలని కోరుకుంటూ ఓనం శుభాకాంక్షలు చెప్తున్నాను.
- ఈ ముగ్గులోని పువ్వుల వలె ప్రకాశంవతమైన, అందమైన జీవితం మీ సొంతమవ్వాలని కోరుకుంటూ ఓనం శుభాకాంక్షలు.
- ఈ ఓనం పండుగ మీ ప్రియమైన వారికి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. మీరు మరచిపోలేని జ్ఞాపకాలు అందివ్వాలని కోరుకుంటూ ఓనం శుభాకాంక్షలు.
- మహాబలి రాజు, దేవతల ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఓనం.
- ఈ ఓనం మీకు అదృష్టాన్ని, మంచి ఆరోగ్యాన్ని, హృదయం నిండుగా సంతోషాలని పంచాలని కోరుకుంటూ ఓనం శుభాకాంక్షలు.
Also Read : రాక్షసరాజును ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగే ఓనం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)