News
News
X

Nellore News : రైల్వే ట్రాక్ మధ్యలో దర్గా, నెల్లూరులో ఇదో అద్భుతం  

Nellore News : హజరత్ సయ్యద్ మొహిద్దిన్ షావలి ఖాదరి దర్గా.. రైల్వే ట్రాక్ ల మధ్య ఉండటమే కాదు, దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. భూమికి 15 అడుగుల లోతులో దర్గా ఉంటుంది. దర్గా లోపలికి వెళ్లాలంటే మెట్లు దిగి వెళ్లాలి.

FOLLOW US: 

Nellore News : ఆలయాలయినా, దర్గాలయినా, ఇతర ప్రార్థనా మందిరాలయినా.. రోడ్డుకి, రైల్వే ట్రాక్ కి అడ్డుగా వస్తే.. వాటిని కాస్త పక్కకు జరపాలని ప్రయత్నిస్తుంటారు. నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ అలాంటి ప్రయత్నం చేసినా సాధ్యపడకపోవడంతో నెల్లూరులో రైల్వే ట్రాక్ రూట్ నే మార్చేశారు. నెల్లూరు రైల్వే స్టేషన్ చివరిలోనే ఈ దర్గా ఉంటుంది. రైల్వే ట్రాక్ కి అడ్డుగా ఉందని ఆనాటి బ్రిటిషర్లు దర్గాని తరలించే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. దీంతో వారే పక్కకు తప్పుకున్నారు. దర్గాకు అటు, ఇటు రైల్వే ట్రాక్ లను ఏర్పాటు చేశారు. దర్గా మాత్రం ఈ రెండు ట్రాక్ ల మధ్య ఇలా మిగిలిపోయింది. 

హజరత్ సయ్యద్ మొహిద్దిన్ షావలి ఖాదరి దర్గా. కేవలం రైల్వే ట్రాక్ ల మధ్య ఉండటమే కాదు, దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. భూమికి సుమారు 15 అడుగుల లోతులో ఈ దర్గా ఉంటుంది. దర్గా లోపలికి వెళ్లాలంటే మెట్లు దిగి కిందకు వెళ్లాలి. భూమిపైకి చాలా చిన్నదిగా కనిపించే ఈ దర్గా.. లోపల మాత్రం పెద్దదిగా కనిపిస్తుంది. భూమి లోపలే సమాధులుంటాయి. ఆ సమాధులపై పవిత్ర వస్త్రాన్ని పరుస్తారు. దీపాలు వెలిగిస్తారు. భక్తులు లోపలికి దిగి వెళ్లి సమాధులను దర్శించుకుని వస్తుంటారు. 

నెల్లూరు పెన్నా నది దాటిన వెంటనే రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యే దగ్గర ఈ దర్గా ఉంటుంది. నెల్లూరు ప్రతిష్టాత్మక రంగనాయకుల స్వామివారి గుడికి అతి సమీపంలోనే ఈ దర్గా ఉంటుంది. ఇక్కడి రైల్వే గేట్ ని రంగనాయకుల గేట్ అంటారు. రైల్వే గేట్ ద్వారా వెళ్లే రోడ్ దర్గా ముందునుంచి వెళ్తుంది. బ్రిటిష్ వారు రైల్వే ట్రాక్ వేయడానికి ముందే ఇక్కడ సయ్యద్ మొహిద్దీన్ షావలి ఇక్కడ చిన్న స్థావరం ఏర్పాటు చేసుకుని భక్తులకు ఆశీస్సులు ఇస్తుండేవారని అంటారు. కాలక్రమంలో ఆయన సమాధిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ సమాధిని దర్శించడానికి వచ్చే భక్తులు ఇక్కడ మొక్కుకుంటారు. తమ కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ దర్గాను దర్శిస్తుంటారు. ప్రతి ఏడాదీ గంధ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. 

విశేషాలివే?

దర్గా పక్కనే రైల్వే గేట్ ఉంటుంది. రైల్వే గేట్ అంటే ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరగకమానదు. కానీ ఇక్కడ దర్గాను దర్శించుకోడానికి వచ్చేవారెప్పుడూ ఈ రైల్వే గేట్ వద్ద ప్రమాదానికి గురి కాలేదని చెబుతుంటారు. అసలీ గేట్ వద్ద ప్రమాదాలు కూడా ఎప్పుడూ జరిగిన సందర్భాలు లేవంటారు. దర్గా 15 అడుగుల లోపల ఉన్నా కూడా వర్షం పడినప్పుడు చుక్కనీరు లోపల నిలబడదని చెబుతుంటారు దర్గా పీఠాధిపతులు. పెన్నా నదికి వరదలు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు నీటమునిగినా దర్గా వద్దకు మాత్రం నీరు రాదు. అదే ఇక్కడి మహిమగా చెబుతుంటారు. పిల్లలు లేనివారు ఈ దర్గాకు వచ్చి వెళ్లిన తర్వాత సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడివారి నమ్మిక. ఈ దర్గాకు సమీపంలోనే.. షావలి వంశస్ధుల సమాధులున్నాయి. దర్గాను దర్శించిన భక్తులు.. షావరి వంశస్థుల సమాధులను సందర్శించడం ఆనవాయితీ. రైల్వే ట్రాక్ ల మధ్య, భూమిలోపలికి ఉన్న ఇలాంటి అరుదైన దర్గా బహుశా మనదేశంలో నెల్లూరులో మాత్రమే ఉంది. 

Published at : 19 Aug 2022 11:08 PM (IST) Tags: Nellore Update Nellore news nellore darga nellore darga between railway tracks

సంబంధిత కథనాలు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Karwa Chauth Atla Taddi 2022: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Karwa Chauth Atla Taddi 2022:   'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Horoscope Today 7th October 2022: ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Horoscope Today 7th  October 2022:  ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!