Dussehra 2022: నవరాత్రుల్లో ఏడోరోజు కాళరాత్రి దుర్గ, సకల భయాలు రూపుమాపే చల్లని తల్లి
Sri kalaratri durga Devi Alankaram: నవరాత్రుల్లో ఏడో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాళరాత్రి దుర్గ. భక్తుల భయాలు తొలగించడంతో శుభంకరీ అని కూడా పిలుస్తారు...కాళరాత్రి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే....
Sri kalaratri durga Devi Alankaram: నవరాత్రి ఏడవ రోజు కాళరాత్రి : నల్లని రూపుతో, విరబోసుకున్న కేశాలతో, మెరుపులు చిమ్మే హారంతో కాళరాత్రిని తలపించే దేవి కాళరాత్రి. తనని ఆరాధించినవారి మనసులోని సకల భయాలనూ రూపుమాపే చల్లని తల్లి. గార్ధభ వాహనం మీద కనిపించే ఈ తల్లి పేరు వింటే భూతప్రేతాలు సైతం దరిచేరవని భక్తుల విశ్వాసం.
ధ్యాన మంత్రం
వామ్ పాడొల్ల సల్లోహలతా కణ్టక భూషణా |
వర్ధన మూర్ధ ధ్వజా కృష్ణ కాళరాత్రి భార్యంకరీ ||
కాళరాత్రి స్వరూపం చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందుకే ఈమెను భక్తుల పాలిట ‘శుభంకరి’ అని కూడా అంటారు. దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. బ్రహ్మాండాల్లో సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రంలో ఉండే సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. కాళరాత్రి దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరిస్తే రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ భయంతో పారిపోతాయి...ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. కాళరాత్రి దుర్గను ఆరాధిస్తే అగ్ని,జలము,జంతువుల భయం ఉండదు.
Also Read: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!
కాళరాత్రి దేవి కథ
దుర్గామాత రాక్షసుల దాడిని ఎదుర్కొన్నప్పుడు ఆమె బంగారు చర్మం తొలగిపోయి హింసాత్మక, భీకర, వికర్షణ రూపంతో ఉద్భవించింది. అందుకే కాళరాత్రి అంటారు. కాళరాత్రి అంటే చీకటి, భయంకరమైనది అని అర్థం. అన్ని దుష్ట శక్తులను, దయ్యాలు, అన్ని ప్రతికూల శక్తులు, భయాలను లొంగదీసుకునేటట్లుగా ఈ అమ్మవారు ఉంటుంది. అమ్మవారు తన భక్తులకు భయాన్ని దూరం చేయడమే కాదు..సకల శుభాలు కలిగిస్తుంది..అందుకే శుభంకరి అంటారు.
Also Read: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!
కాళరాత్రి దేవి ప్రాముఖ్యత
శని గ్రహాన్ని పాలించే కాళరాత్రి దుర్గాదేవి..మంచి, చెడులను సరిసమానంగా అమలు చేస్తుంది. చెడును శిక్షించి, మంచిని ప్రోత్సహిస్తుంది. కృషిని గుర్తిస్తుంది. జాతకంలో శనిగ్రహం ప్రభావం వల్ల ఏర్పడే ప్రతికూలతను తగ్గిస్తుంది.
నవ దుర్గా స్తోత్రం
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥
దేవీ శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥
దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥
దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥
దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥
దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥
దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥
దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥