దసరా 2022: మూలా నక్షత్రం రోజు ఇవి చదువుకోండి!



ఆశ్వయుజ శుద్ధ్ద సప్తమి శరన్నవరాత్రుల్లో ఏడవ రోజు సరస్వతి అలంకారాన్ని పూజిస్తారు...



ప్రణోదేవీ సరస్వతీ, వాజేభిర్వాజినీ వతీ ధీనామ విత్ర్యవతు



సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||



యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా



పోతన చెప్పిన శ్లోకం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....



సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ



ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ



నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ



సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!
ఈ శ్లోకాన్ని నిత్యం 11 సార్లు చెప్పుకుని సరస్వతి దేవికి నమస్కరించాలి. ఆర్థిక సమస్యలతో చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయపడటం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల చదువుల తల్లి కరుణ ఉంటుందని చెబుతారు.



ఓం వాగ్దేవ్యైచ విద్మహే....బ్రహ్మపత్న్యైచ
ధీమహీ...తన్నో వాణీ ప్రచోదయాత్
(Images credit: Pixabay)