అనుకోకుండా 111 లేదా 11:11 సంఖ్య చూశారా? ఏమవుతుంది? ఈ రోజు ఎక్కడైనా మీరు 111, లేదా 11:11 ఇలా ఏదైనా సీరీస్ నెంబర్లు చూశారా? నెంబర్ల రిపిటీషన్ అనేది విశ్వం నుంచి వచ్చే శక్తివంతమైన మెసేజ్ కావచ్చట. ఇలా రిపీటెడ్ గా కనిపించే నంబర్లను ఎంజిల్ నెంబర్స్ అంటారు. ఈ నెంబర్లు వర్తమానం జీవితం లేదా భవిష్యత్తుకు కొత్త అర్థాన్ని తెలియజేస్తాయట. ఏంజిల్ నెంబర్లు సూపర్ పవర్ తో అనుసంధించి ఉంటాయట. 111 లేదా 11:11 కనిపిస్తే.. మీకు కొత్త అవకాశాలు వస్తున్నాయనడానికి సూచన కావచ్చు. ఈ సంఖ్యలు మీకు గడియారం లేదా మరేదైనా వస్తువు, ఇళ్లపై కనిపించవచ్చు. ఈ నెంబర్లు కనిపిస్తే మీ ప్లానింగ్ ఫలించబోతుందనే సంకేతం వచ్చినట్లు. మీకు 1 సీరీస్ కనిపిస్తే ఆలోచనలు, ప్లానింగ్స్, కొత్త గోల్స్ వంటి వాటి గురించి శ్రద్ధ పెట్టండి. యూనివర్స్ మీ కోసం ఏదో కొత్తగా ప్లాన్స్ చేస్తుందని గుర్తించండి. Images Credit: Pexels, Pixabay and Unsplash