News
News
X

Navratri 2022: అజ్ఞానాన్ని తొలగించే ఆరో దుర్గ కాత్యాయని, నవరాత్రుల్లో ఆరవ రోజు కాత్యాయనీ అలంకారం

Sri Katyayani Devi Alankaram: నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది.

FOLLOW US: 
 
‘చంద్ర హాజ్జ్వల కరా శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాత్‌ దేవీ దానవ ఘాతినీ’

పూర్వం కాత్యాయనుడే మహర్షి అమ్మవారు తన ఇంట జన్మించాలనే కోరికతో ఆమెను ఆరాధించాడట. అలా ఆయన ఇంట జన్మించిన తల్లే కాత్యాయని. అభయవర ముద్రలతో పాటుగా ఒక చేత ఖడ్గాన్నీ, మరో చేత పద్మాన్నీ ధరించి ఈ అమ్మవారు కనిపిస్తారు. ఖడ్గం ఆపదలను ఎదుర్కొనడానికి సూచన కాగా, పద్మం అజ్ఞానాన్ని దహించే చిహ్నం. ఈ రెండింటినీ దూరం చేయగల తల్లి కాత్యాయని. 

నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజస్సుతో అలరారుతుంది. కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహాతేజో పుంజం అని అర్థం. తేజస్సు అంటే జ్ఞానం, కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవ సాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి ఈమె. మహిషాసుర సంహారంలో కాత్యాయని సింహ వాహనం అధిష్ఠించి దుర్గాదేవికి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతోంది. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయనిని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెబుతారు. ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మ. ఆ మూలపుటమ్మను ధ్యానిస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. విద్యార్థులు ఆ తల్లిని ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. కన్యలు కాత్యాయనీ దేవిని కొలిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది.

Also Read: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!

News Reels

కాత్యాయని అష్టకం 

శ్రీగణేశాయ నమః ।
అవర్షిసఞ్జ్ఞం పురమస్తి లోకే కాత్యాయనీ తత్ర విరాజతే యా ।
ప్రసాదదా యా ప్రతిభా తదీయా సా ఛత్రపుర్యాం జయతీహ గేయా ॥ 1॥

త్వమస్య భిన్నైవ విభాసి తస్యాస్తేజస్వినీ దీపజదీపకల్పా ।
కాత్యాయనీ స్వాశ్రితదుఃఖహర్త్రీ పవిత్రగాత్రీ మతిమానదాత్రీ ॥ 2॥

బ్రహ్మోరువేతాలకసింహదాఢోసుభైరవైరగ్నిగణాభిధేన ।
సంసేవ్యమానా గణపత్యభిఖ్యా యుజా చ దేవి స్వగణైరిహాసి ॥ 3॥

గోత్రేషు జాతైర్జమదగ్నిభారద్వాజాఽత్రిసత్కాశ్యపకౌశికానామ్ ।
కౌణ్డిన్యవత్సాన్వయజైశ్చ విప్రైర్నిజైర్నిషేవ్యే వరదే నమస్తే ॥ 4॥

భజామి గోక్షీరకృతాభిషేకే రక్‍తామ్బరే రక్‍తసుచన్దనాక్‍తే ।
త్వాం బిల్వపత్రీశుభదామశోభే భక్ష్యప్రియే హృత్ప్రియదీపమాలే ॥ 5॥

ఖడ్గం చ శఙ్ఖం మహిషాసురీయం పుచ్ఛం త్రిశూలం మహిషాసురాస్యే ।
ప్రవేశితం దేవి కరైర్దధానే రక్షానిశం మాం మహిషాసురఘ్నే ॥ 6॥

స్వాగ్రస్థబాణేశ్వరనామలిఙ్గం సురత్‍నకం రుక్మమయం కిరీట్మ ।
శీర్షే దధానే జయ హే శరణ్యే విద్యుత్ప్రభే మాం జయినం కురూష్వ ॥ 7॥

నేత్రావతీదక్షిణపార్శ్వసంస్థే విద్యాధరైర్నాగగణైశ్చ సేవ్యే ।
దయాఘనే ప్రాపయ శం సదాస్మాన్మాతర్యశోదే శుభదే శుభాక్షి ॥ 8॥

ఇదం కాత్యాయనీదేవ్యాః ప్రసాదాష్టకమిష్టదమ్ ।
కుమఠాచార్యజం భక్‍త్యా పఠేద్యః స సుఖీ భవేత్ ॥ 9॥

॥ ఇతి శ్రీకాత్యాయన్యష్టకం సమ్పూర్ణమ్ ॥

Also Read: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!

Published at : 01 Oct 2022 10:22 AM (IST) Tags: dussehra 2022 puja time Maha Navmi 2022 Durga Ashtami 2022 Date Chandraghanta Kushmanda Skandamata Katyayani Kalaratri Mahagauri Navratri 2022 Ammavaari Avataralu Vijayawada Kanaka Durga

సంబంధిత కథనాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో శక్తి పీఠం?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో శక్తి పీఠం?

Sri Krishna Temple: దక్షిణ అభిముఖ శైలి ఉన్న కృష్ణుడి ఆలయం- మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అరుదైన గుడి!

Sri Krishna Temple: దక్షిణ అభిముఖ శైలి ఉన్న కృష్ణుడి ఆలయం- మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అరుదైన గుడి!

టాప్ స్టోరీస్

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల