మహాభారతం అరణ్య పర్వంలోనిది ఈ యక్ష ప్రశ్నల ఘట్టం



అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైతవనానికి చేరుకున్నప్పుడు.... ఓ పండితుడు ధర్మరాజు వద్దకు వెళ్లి సహాయం అడుగుతాడు .



తనవద్దనున్న 'అరణి' (నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే కొయ్య)ని ఒక మృగం అపహరించిందని దాన్ని సంపాదించిపెట్టమని ప్రార్థిస్తాడు. ఆ పనిపై వెళ్లిన తన సోదరులు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో ధర్మరాజు వాళ్లను వెతుక్కుంటూ వెళతాడు.



ఓ సరస్సు దగ్గర విగతజీవులైన సోదరులను చూసి నోరు పిడచ గట్టుకుపోతుంది. నీళ్లు తాగుదామని సరస్సులో దిగుతుండగా ఓ యక్షుడి హెచ్చరిక వినిపిస్తుంది.



తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని యక్షుడు కోరడంతో సరే అంటాడు ధర్మరాజు. ఇంతకీ యక్షుడు ఎవరంటే యమధర్మరాజు. పాండవులను పరీక్షించటానికి యముడే ఆ రూపంలో వచ్చి ప్రశ్నలు అడిగాడు



1 సూర్యుణ్ణి ఉదయించేలా చేసినదెవరు
Ans: బ్రహ్మం



2 సూర్యుని చుట్టూ తిరిగేదెవరు?
Ans: దేవతలు



3 సూర్యుని అస్తమింపచేసేది ఏది?
Ans: ధర్మం



4 సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
Ans: సత్యం



5 మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
Ans: వేదం



6 దేనివలన మహత్తును పొందుతాడు?
Ans: తపస్సు