అన్వేషించండి

Navratri 2022: సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా

Dussehra 2022: అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ కనకదుర్గమ్మ..ఈ రోజు శ్రీ లిలితా దేవిగా భక్తులకు దర్శనం ఇస్తోంది. ఈ రోజు అమ్మను పూజించే వారికోసం లలితా చాలీసా....

Sri Lalitha Tripura Sundari Devi Today: ఆశ్వయుజ శుద్ధ పంచమి శరన్నవరాత్రుల్లో శుక్రవారం 5వ రోజు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు పంచమి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనం ఇస్తారు. లలితాత్రిపుర సుందరీ దేవికి కుంకుమార్చన ఇష్టమైన సేవ. అమ్మవారి భక్తులకోసం శ్రీ లలితా చాలీసా..

సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా (Lalitha Chalisa In Telugu )

లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || 1 ||

హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || 2 ||

పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి || 3 ||

శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి || 4||

నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు || 5 ||

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు ||6 ||

శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా || 7 ||

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి || 8 ||

పసిడి వెన్నెలా కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి || 9 ||

రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు || 10 ||

కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి || 11 ||

రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగ
రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు || 12 ||

ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రం చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా || 13 ||

మహామంత్రాధిదేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్య బాధలు తొలిగించి మహదానందము కలిగించే ||14||

అర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మా || 15 ||

విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి || 16 ||

ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ || 17 ||

దక్షుని ఇంట జనియించి సతీదేవిగ చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ || 18 ||

శంఖు చక్రమును ధరియించి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు || 19 ||

పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగ
చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరయించితివి || 20 ||

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే || 21 ||

సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి || 22 ||

మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ || 23 ||

సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి || 24 ||

మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి || 25 ||

చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే || 26 ||

అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం || 27 ||

అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా || 28 ||

నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు || 29 ||

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి || 30 ||

అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి || 31 ||

గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి || 32 ||

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి || 33||

కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా || 34 ||

ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు || 35 ||

మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి || 36 ||

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా || 37 ||

ఆశ్రితులందరు రారండి అమ్మరూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము || 38 ||

సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు || 39 ||

మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము || 40 ||

Also Read:  ఐదవ రోజు లతితా త్రిపురసుందరీ దేవి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు

Also Read: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Starlink Vs Russia: ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
Embed widget