అన్వేషించండి

Muharram 2023: మొహర్రం ఎందుకు జరుపుకుంటారు!

Muharram 2023: ముహర్రం ముస్లిం సమాజం జ‌రుపుకొనే ముఖ్యమైన ప‌ర్వ‌దినాల్లో ఒకటి. ఇది దుఃఖాన్ని సూచించే పండుగ. మొహర్రం చరిత్ర ఏమిటి? ముస్లింలు మొహర్రం ఎందుకు జరుపుకొంటారు?

Muharram 2023:  పవిత్ర 'మొహర్రం' ప‌ర్వ‌దినం ఇస్లామిక్ క్యాలెండర్ మొదటి నెలను, కొత్త ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇస్లామిక్ సమాజంలో ముహర్రం ప‌ర్వ‌దినానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర మాసాన్ని హిజ్రీ లేదా 'అల్లా మాసం' అని కూడా అంటారు. ఈ నెలలో ముస్లిం ప్రజలు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. ముహర్రం నెల ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12 చంద్ర మాసాల‌పై ఆధారపడి ఉంటుంది, కొత్త చంద్రుని రూపం ఆధారంగా కొత్త నెల ప్రారంభాన్ని నిర్ణయిస్తారు. 2023లో ముహర్రం జూలై 19వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 29వ తేదీన ముగుస్తుంది. 

 'మొహర్రం' ప్రాముఖ్యత
 'మొహర్రం' ముస్లింలకు అత్యంత ముఖ్యమైన ప‌ర్వ‌దినాల్లో ఒకటి. ఈ రోజు ముహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ మరణాన్ని స్మరించుకుంటారు. ముహర్రం ముస్లిం ఉమ్మాకు జ్ఞాపకార్థం కూడా జ‌రుపుకుంటారు. కర్బలా యుద్ధం ఇస్లామిక్ క్యాలెండర్ 61వ సంవత్సరంలో ముహర్రం (ఆషూరా రోజు) 10వ తేదీన జరిగింది. ఆ రోజు మ‌హ‌మ్మ‌ద్‌ ప్రవక్త ప్రియమైన మనవడు ఇమామ్ హుస్సేన్ దారుణంగా హత్యకు గుర‌య్యాడు. ముఖ్యంగా పోరాటాన్ని నిషేధించిన నెలలో, అతను దారుణంగా మ‌ర‌ణించాడు. ప్రజలు ఆషూరాకు ముందు 9వ రోజు ఉపవాసం పాటిస్తారు.

Also Read : బక్రీద్ రోజు మూగజీవాలను ఎందుకు బలిస్తారు, బక్రీద్ పండుగలో ఆంతర్యం ఏంటి!

ఈ పవిత్ర మాసాన్ని హదీసులో అల్లాహ్ నెలగా కూడా పేర్కొంటారు. ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల, ఇది మదీనాకు ముస్లిం తీర్థయాత్రను సూచిస్తుంది. ఈ 'మొహర్రం' పండుగ 622 CEలో మొదటి ఇస్లామిక్ రాజ్య స్థాపనను సూచిస్తుంది.

 'మొహర్రం' 2023 తేదీ
2023లో, ముస్లిం సమాజం అత్యంత ముఖ్యమైన ప‌ర్వ‌దినాల్లో ఒకటైన ముహర్రం జూలై 29వ తేదీ శనివారం జరుపుకొంటారు. ముహర్రం 10 రోజుల పవిత్ర వేడుక జూలై 19వ తేదీన ప్రారంభమైంది, జూలై 29వ తేదీన‌ ముగుస్తుంది.

అషూరా అంటే?
అషూరా అంటే ముహర్రం 10వ రోజు. ఈ పవిత్రమైన రోజున ప్రజలు ఉపవాసాలు పాటించాలి. అషూరా రోజు అల్లాహ్ పట్ల కృతజ్ఞత చూపడానికి ఒక అవకాశం. ఆషూరా రోజున పెద్ద సంఖ్యలో ముస్లింలు ఊరేగింపులు నిర్వహిస్తారు. వారు సంతాప కర్మను నిర్వహిస్తారు. కొందరు మసీదులను సందర్శిస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఎక్కువ సమయం అక్కడే గడుపుతారు.

హుస్సేన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. చాలా మంది వ్యక్తులు ఛాతీ కొట్టుకుంటూ, నుదిటిపై కొట్టుకుంటూ, శ‌రీరాన్ని హింసించుకుంటారు. ఇందులో వారు తమ బాధను వ్యక్తం చేయడానికి పదునైన కత్తులు, చాకులతో ర‌క్తం వ‌చ్చేలా గాయ‌ప‌ర‌చుకుంటారు. ముస్లిం సమాజం ప్రకారం, 'మొహర్రం' ఆనందకరమైన పండుగ కాదు. ఇది శోకం లేదా దుఃఖాన్ని విడిచిపెట్టే నెల.

Also Read : రంజాన్ నెలలోనే హలీమ్‌ను తింటారు, ఎందుకు?

 'మొహర్రం'
 'మొహర్రం' అనేది ముస్లింలు జరుపుకునే ప‌ర్వ‌దినం. దీనిని 10 రోజుల పాటు జరుపుకొంటారు. సాధారణంగా ప‌ర్వ‌దినం అంటే ఇంట్లోని కుటుంబ స‌భ్యులంతా సంతోషంగా చేసుకుంటారు. అయితే, ముహర్రం మాత్రం విషాదానికి సంకేతం. ఇది దుఃఖాన్ని సూచించే పండుగ.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

కార్తీక పౌర్ణమి 2026: శుభ ఫలితాల కోసం ఏం చేయాలి? ఏం చేయకూడదు?
కార్తీక పౌర్ణమి 2026: శుభ ఫలితాల కోసం ఏం చేయాలి? ఏం చేయకూడదు?
మీ సంతకం మీ స్వభావం ఏంటో చెప్పేస్తుంది! 12 రకాల సంతకాల్లో మీరెలా?
మీ సంతకం మీ స్వభావం ఏంటో చెప్పేస్తుంది! 12 రకాల సంతకాల్లో మీరెలా?
మీ ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారానికి సంబంధించిన ఈ 3 పొరపాట్లు కారణం కావొచ్చు!
మీ ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారానికి సంబంధించిన ఈ 3 పొరపాట్లు కారణం కావొచ్చు!
నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు ఎలాంటి ఫలితాలు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Embed widget