News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Moodami 2022: మూఢం అంటే ఏంటి, ఈ టైమ్ లో శుభకార్యాలు ఎందుకు చేయొద్దంటారు..

మూఢం అనే మాట ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు మూఢం అంటే ఏంటి, ఎందు కొస్తాయి, మూఢాలతో సమస్యేంటి, ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని అంటారెందుకు. ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, చేస్తే ఏమవుతుంది.

FOLLOW US: 

గురుమూఢమి: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 ( కొన్ని పంచాంగాల్లో ఫిబ్రవరి 20, 21 తేదీల్లో మూఢం అని ప్రస్తావించారు) 

నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమికూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు. అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతుంటాయి. అందుకే దీనికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతుంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది.

Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే

ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడే దానిని  గురు మూఢం అని,  అలానే శుక్రుడు సూర్యునికి  దగ్గరగా  వచ్చి నప్పుడు  ఏర్పడే దానిని శుక్ర మూఢమని  అంటారు . సూర్యునికి  దగ్గరగా  గురు , శుక్రులు  వచ్చి నప్పుడు , గురు శుక్రుల  శక్తులు  తగ్గి బలహీనమైపోతాయి, నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిల్లుతుంది. అంటే వేయి  వాట్స్  బల్బు ముందు క్యాండిల్  పెడితే , ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి ఎంతే బలహీనంగా ఉంటుంది. గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఏ  శుభ కార్యక్రమానికైనా  గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు.  

Also Read:  ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే

మూఢంలో ఏం చేయకూడదు

 • శుభగ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టే మూఢాల్లో  వివాహాది శుభ కార్యాలు జరుప కూడదు
 • లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు
 • పుట్టు వెంట్రుకలు తీయించరాదు
 • గృహ శంకుస్థాపనలు  చేయ రాదు
 • ఇల్లు మారకూడదు

మూఢంలో ఇవి చేసుకోవచ్చు

 • అన్న ప్రాసన చేసుకోవచ్చు
 • ప్రయాణాలు చేయవచ్చు
 • ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు
 • భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు
 • నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు
 • నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు

మూఢాల కాలంలో శుభ కార్యాలు చేస్తే ఏమవుతుంది ?
మహర్షులు, జ్యోతిష్య పండితులు, అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావొచ్చు. కష్టం కలుగవచ్చు , నష్టం  వాటిల్లవచ్చు. 

అయితే కొన్ని ఆ సమయంలోనే తప్పనిసరిగా చేయాల్సిన పనులను మూఢంలో ముడిపెట్టడం మంచిది కాదంటారు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పట్టింపు లేనివారు నిరభ్యంతరంగా ఏ పనైనా చేసుకోవచ్చు..దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Published at : 21 Feb 2022 03:59 PM (IST) Tags: guru moodam Guru Moudhyami shukra moodam importance of moodam moodam dates in 2022 telugu moodam details moodam in 2022 pelli muhurtham in 2022

సంబంధిత కథనాలు

Happy Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Happy Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Horoscope Today 18 August 2022: ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

Horoscope Today 18 August 2022:  ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

టాప్ స్టోరీస్

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు