అన్వేషించండి

Mahashivratri 2026: మాయ నుంచి మోక్షం వరకు.. నిర్వాణ షట్కం ఆధ్యాత్మిక రహస్యాలు ఇవే!

Mahashivratri Special sloka : నిర్వాణ అంటే 'నిరాకారం' , ఆకారం లేనిది అని అర్థం - శివోహం రూపంలో చిదానందాన్ని చూపిస్తోంది.. నిర్వాణ షట్కం వివరించే విషయం ఇదే

Mahashivratri 2026:  ఆది శంకరాచార్యలులు రచించిన అత్యంత వేదాంత రత్నం నిర్వాణ షట్కం. ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు.. మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే ఆత్మాన్వేషణ సాధన..

నిర్వాణ షట్కం ఎందుకు చదవాలి?

- నిజమైన నేను ఎవరో తెలుసుకునేందుకు చదవాలి

- అద్వైత వేదాంతంలో సారాంశం ఇది..నీవే ఆ పరమాత్మవి అని చెబుతుంది

- అహంకారం, మమకారం, ఆసక్తి తగ్గి వైరాగ్యం వస్తుంది
 
- మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది

- మరణం భయం తొలగిపోతుంది
 
- ఆధ్యాత్మిక జాగృతినిస్తుంది
 
-  రోజువారి పని ఒత్తిడి, డ్రిపెషన్ , ఆందోళన తగ్గుతాయి

Nirvana shatakam

మనో బుధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్రం నజిహ్వా నచ ఘ్రాణనేత్రె |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||

అర్థం: నేను మనసుని కాదు చిత్తాన్ని కాదు బుద్ధిని కాదు అహంకారాన్ని కాదు. నేను పంచేంద్రియాలైన  చెవి ముక్కు కన్ను నాలుక చర్మాన్ని కూడా కాదు.  భూమి, నీరు, అగ్ని, వాయువు , ఆకాశం అనే  పంచభూతాలను కూడా కానేకాదు. నేను చిదానంద రూపాన్ని శివుడిని. 
  
నచ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ||

నేను ప్రాణాన్ని నేను కాదు.  ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలుగా చెప్పే  పంచవాయువులను కాదు... రక్త, మాంస, మేధో, ఆస్థి, మజ్జా, రస, శుక్రములని చెప్పే  సప్త ధాతువులను కాదు.  అన్నమయ,ప్రాణమయ,మనోమయ, విజ్ఞ్యానమయ, ఆనందమయం గా చెప్పే పంచకోశాలను కాదు. కర్మేంద్రియాలైన వాక్కు,పాణి,పాద,పాయు,ఉపస్థను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. 
 
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ||

నాలో రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేనుకాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.
 
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
నమన్త్రో నతీర్ధం నవేదా నయజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ||

నాకు పాపపుణ్యాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.

నమే మృత్యు ర్న శంకా నమే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ||

నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేనే లేవు. నాకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు,  గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. 

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న చ సంగతం నైవ ముక్తిర్ న మేయ:
చిదానంద రూపః శివోహం శివోహం ||

నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్న నాకు  మోక్షం  లేదు, బంధం  లేదు... నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
11-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ఏ రాశికి అదృష్టం? ఎవరికి సవాళ్లు?
11-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ఏ రాశికి అదృష్టం? ఎవరికి సవాళ్లు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget