By: ABP Desam | Updated at : 24 Feb 2022 02:40 PM (IST)
Edited By: RamaLakshmibai
Mahashivratri 2022
విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై గంగను ధిరించినా గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే. అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉంది. అవేంటంటే ...
ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం
ఆవు పాలు - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు
ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి - ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది
తేనె - తేజస్సు వృద్ధి చెందుతుంది
భస్మ జలం - పాపాలు నశిస్తాయి
సుగంధోదకం - పుత్ర లాభం
పుష్పోదకం - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు
బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి
నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది
రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది
సువర్ణ జలం - దరిద్ర నాశనం
అన్నాభిషేకం - సుఖ జీవనం
ద్రాక్ష రసం - సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం - సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం - శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి
ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు
గంగోదకం - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం
నేరేడు పండ్ల రసం - వైరాగ్యం
నవరత్న జలం - గృహ ప్రాప్తి
మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి
పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
విభూది - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.
Also Read: శివుడుని 'లయకారుడు' అని ఎందుకంటారు
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానందభాజామ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే || 1 ||
గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాదిపాలమ్ |
జటాజూటగంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే || 2 ||
ముదామాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం
శివం శంకరం శంభుమీశానమీడే || 3 ||
వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదాసుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభుమీశానమీడే || 4 ||
గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం
గిరౌసంస్థితం సర్వదా పన్నగేహమ్ |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభుమీశానమీడే || 5 ||
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాం ప్రధానం
శివం శంకరం శంభుమీశానమీడే || 6 ||
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం
శివం శంకరం శంభుమీశానమీడే || 7 ||
హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే || 8 ||
స్తవం యః ప్రభాతే నరశ్శూలపాణేః
పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం
విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి || 9 ||
సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే ‘సాలగ్రామం’ - ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ మాయం!
Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు
Gunadala Mary Mata Festival: ఈ 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు - అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!
Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Shiva Rajkumar Emotional : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ