అన్వేషించండి

Maha Shivaratri 2024: శివుడికి 5 రూపాలు - మీరు ఏ రూపం పూజించాలో తెలుసా!

Maha Shivaratri 2024: దేవుళ్లంతా ఒళ్లంతా ఆభరణాలతో వెలిగిపోతుంటారు..కానీ శివుడు బూడిద పూసుకుని, అర్థనారీశ్వరుడిగా, కుటుంబ సమేతంగా, అఘోరాధిపతిగా..ఏంటివన్నీ... ఏ రూపాన్ని ఎవరు పూజించాలి...

Maha Shivaratri 2024 Panchanana Aspects:  దేవుళ్లంతా నిత్య అలంకరణలో కనిపిస్తారు కానీ శివుడు ఎందుకు కనిపించడు అనుకుంటున్నారేమో..శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు అలంకార ప్రియుడు కూడా. శంకరుడు కూడా సర్వాలంకార భూషితుడే. అయితే  ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే  తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం...

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

తత్పురుషం

తేజోవంతుడిగా, ధ్యానంలో కూర్చుని, ప్రశాంతంగా కనిపిస్తూ..తూర్పుముఖంగా కూర్చుని ఉండే శివుడి రూపాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడు. ఈ రూపానికి పూజలందించేది కూడా దేవతలే.

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి 
తన్నో రుద్రః ప్రచోదయాత్ 

Also Read: దోసపండుకి - మృత్యువుకి ఏంటి సంబంధం శివయ్యా!

సద్యోజాతం

శివుడంటే లింగరూపమే. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోజాతం అంటారు. లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు. 

సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 
భవే భవే నాతిభవే భవస్వ మామ్|భవోద్భవాయ నమః 

వామదేవం

పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే అని చాటిచెప్పే రూపమే వామదేవం. శివుడు కుటుంబంతో సహా కనిపించే రూపంలో సర్వాలంకార భూషితుడిగా ఉంటాడు. మిగిలిన రూపాల్లో కనిపించని విధంగా శివుడు అలంకారాలతో, పక్కన అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి, నంది తో కన్నులపండువగా కనిపిస్తాడు. సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతానంతో తులతూగాలని మానవాళిని ఆశీర్వదించే రూపం ఇది. ఆలయాల్లో మినహా ఇంట్లో ఎక్కువగా పూజించేది ఈ రూపాన్నే.

వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ-
శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః
కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ 
నమో మనోన్మనాయ నమః 

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
 
అఘోరం

దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో...అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి, త్రినేత్రం తెరిచి శవాలవైపు  చూస్తూ కనిపిస్తాడు శివుడు. ఈ రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే. భూతప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే అఘోర రూపం భయంకంపితంగా ఉంటుంది. 

అఘోరేభ్యోஉథ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః 
సర్వేభ్య-స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః 
త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాஉమృతాత్ 

Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!

ఈశానం

మరో ముఖంగా చెప్పే ఈశానంలో పరమేశ్వరుడు అత్యంత ప్రియభక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడట.

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!

ఓ౦ నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ 
మహాదేవాయ త్రయంబకాయ 
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ 
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ 
సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః 

మార్చి 8 శుక్రవారం రాత్రి 8గంటల 13 నిముషాల వరకూ త్రయోదశి ఉంది... ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమైంది . మార్చి 9 శనివారం సాయంత్రం 5 గంటల 59 నిముషాల వరకూ చతుర్థశి ఉంది... అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ప్రధానం..అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Jr NTR: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Embed widget