Sitting on the Steps of a Temple: దర్శనం అనంతరం గుడి మెట్లపై కూర్చోవడం వెనుక రహస్యం మీకు తెలుసా?
Sitting on the Steps of a Temple: భగవంతుని దర్శనం కోసం ప్రజలు దేవాలయాలకు వెళతారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన భక్తులు ఆలయం మెట్లపై కూర్చోవడం మనం చూస్తాం. ఇలా కూర్చోవడం వెనుక ఉన్న కారమేంటో తెలుసా?
Sitting on the Steps of a Temple: ఆలయ మెట్ల మీద కూర్చున్న వ్యక్తులు ధర్మం, రాజకీయాలు, ఇతర ప్రాపంచిక విషయాల గురించి చర్చించుకోవచ్చు, కానీ ఈ పురాతన ఆచారానికి చాలా ప్రత్యేక ప్రయోజనం ఉంది. మనం గుడి మెట్లపై కూర్చున్నప్పుడు, మనకు జీవిత సారాంశాన్ని స్పష్టంగా తెలియజేసే శ్లోకాన్ని పఠించాలని గ్రంధాలలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ పురాతన సంప్రదాయం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం రూపొందించారు. నిజానికి, ఆలయం మెట్ల మీద నిశ్శబ్దంగా కూర్చుని, ఒక శ్లోకం చదవాలి. కానీ ఆ పద్ధతిని, మంత్రాన్ని చాలామంది ప్రజలు మర్చిపోయారు. దర్శనానంతరం గుడి మెట్లపై కూర్చుని ఈ శ్లోకాన్ని పఠించాలి. అలా చేయడం ద్వారా జీవితంలోని చాలా కలవరపరిచే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలు పొందుతారు.
ఆ శ్లోకం ఏమిటంటే...
“అనాయాసేన మరణం, బినా దేన్యేన జీవనం,
దేహంత్ తవ సానిధ్యం, దేహి మే పరమేశ్వరం”
తాత్పర్యం
“అనాయాసేన మరణం” అంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా చనిపోవాలి, ఎప్పుడూ అనారోగ్యం బారిన పడకుండా, మంచానికే పరిమితం కాకుండా, బాధతో చనిపోకూడదు. రోజువారీ జీవితాన్ని గడుపుతూనే మా జీవితాలను వెళ్లనివ్వు.
“బినా దేన్యేన జీవనం” అంటే ఒకరిపై ఆధారపడే జీవితం ఉండకూడదు. ఆశ్రయం కోసం ఎప్పుడూ ఎవరితోనూ ఉండాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి పక్షవాతం వచ్చినప్పుడు ఇతరులపై ఆధారపడినట్లే, పక్షవాతం లేదా నిస్సహాయంగా మారవద్దు. భగవంతుని దయతో జీవితాన్ని ఇతరులపై ఆధారపడకుండా, సహాయం కోసం ఇతరులను వేడుకోకుండా జీవించడం.
"దేహంతే తవ సానిధ్యం" అంటే మరణం ఎప్పుడు వచ్చినా అది భగవంతుని సన్నిధిలో వచ్చేలా ఉండాలి. భీష్మ పితామహుడి మరణం సమయంలో, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఆయన ముందు నిలబడ్డాడు. అలా దైవ దర్శనం చేసుకుంటూ ప్రాణాన్ని వదిలేలా చూడు.
"దేహి మే పరమేశ్వరం" అంటే "ఓ దేవా, మాకు అలాంటి వరం ఇవ్వు".
భగవంతుడిని ప్రార్థిస్తూ పై శ్లోకాన్ని పఠించండి. ఉద్యోగం, కారు, బంగళా, అబ్బాయి, అమ్మాయి, భర్త, భార్య, ఇల్లు, డబ్బు మొదలైనవి (అంటే ప్రాపంచిక విషయాలు) అడగవద్దు, ఎందుకంటే మీ గురించి మీకు తెలిసిన దానికంటే భగవంతునికే బాగా తెలుసు. మీ అర్హత మేరకు ఏమివ్వాలో ఆయనే మీకు ఇస్తాడు. అందుకే ఆలయంలో దర్శనం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా కూర్చుని ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన, విన్నపం లేదా యాచించడం కాదు. ఈ ప్రార్థన అనేది ఇల్లు, వ్యాపారం, ఉద్యోగం, కొడుకు, కుమార్తె, ప్రాపంచిక సుఖాలు, సంపద లేదా ఇతర విషయాల కోసం కాదు.
'ప్రార్థన' అనే పదానికి అర్థం - 'ప్ర' అంటే 'ప్రత్యేకమైనది', 'ఉత్తమమైనది', 'అత్యున్నతమైనది'. 'అర్థన' అంటే అభ్యర్థన. ప్రార్థన అంటే 'ప్రత్యేకమైన అత్యున్నత అభ్యర్థన'.
దర్శనం కోసం గుడికి వెళ్లినప్పుడల్లా కళ్లు తెరిచి భగవంతుని దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. కొంతమంది కళ్లు మూసుకుని నిలబడి భగవంతుడిని ప్రార్థిస్తారు. పరమాత్ముని దర్శనానికి వచ్చిన మనం కళ్లు మూసుకోవడం ఎందుకు? కళ్లు తెరిచి భగవంతుని రూపాన్ని, నిజ స్వరూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని చూడండి. మీ మనసు అలౌలిక ఆనందంలో మునిగిపోయేలా, భగవంతుని దివ్యమంగళ స్వరూపంతో మీ కళ్లలో నిండిపోయేలా దర్శనం చేసుకోండి.
దర్శనానంతరం గుడి మెట్ల మీద కూర్చున్నప్పుడు, మీరు కళ్లు మూసుకుని మీరు చూసిన భగవంతుని స్వరూపాన్ని ధ్యానించాలి. కళ్లు మూసుకుని మనసు లోపల ఉన్న ఆత్మను ధ్యానించండి. ధ్యానంలో భగవంతుడు కనిపించకపోతే, ఆలయానికి తిరిగి వెళ్లి మళ్లీ దర్శనం చేసుకోండి. పై శ్లోకాన్ని కళ్లు మూసుకుని పఠించండి.
Also Read : ‘విరూపాక్ష’కూ ఓ ఆలయం ఉంది, ఆ రహస్యాన్ని బ్రిటీషర్లు కూడా తెలుసుకోలేకపోయారు - ఏమిటా వింత?
దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, మనం దర్శనం చేసుకున్నప్పుడు, మన ప్రాపంచిక అవసరాలు, కోరికలను నెరవేర్చగలిగే శక్తిసామర్థ్యాలున్న సర్వశక్తిమంతుడిని చూడడానికి బదులుగా మన ఆత్మలో ఆయన రూపం ముద్రపడేలా చేయాలి. ఆలయం మెట్లపై కూర్చొని, సర్వశక్తిమంతుడితో మన దర్శనం సమయంలో జరిగిన అద్భుత దృశ్యం గురించి ఆలోచించడం అత్యంత అవసరమైన చర్య, దానిని సంప్రదాయ పద్ధతిలో చేయడం తప్పనిసరి.
Also Read : ప్రతి రాత్రి ద్వారకాధీశుని విగ్రహం మాయం.. రత్లాంలోని ఈ ఆలయం గురించి తెలుసా?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.