By: ABP Desam | Updated at : 09 Feb 2023 04:39 PM (IST)
Edited By: Bhavani
Image Credit: Pixabay
సంవత్సరంలో మొత్తం 12 మాస శివరాత్రులు వస్తాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే ఆఖరి శివరాత్రిని మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు. ఈ మహా శివరాత్రిని కొందరు పగటి పూట జరుపుకుంటే చాలామంది రాత్రి జాగారం చేసి జరుపుకుంటారు. సంవత్సరంలోని ఈ చివరి శివరాత్రి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శివభక్తులు ప్రార్థనలు, ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తారు. శివుడు మొత్తం విశ్వానికి మూలం. శివపురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణులతో సహా సమస్త విశ్వానికి మూలం శివుడే. అందుకే శివతత్వం అంటే ఆద్యాంతాలు లేనిదని అర్థం.
శివుడు ఒక అవతారం కాదు సాక్షాత్తు ఈశ్వరుడు, భగవంతుడు. ఆయనే సృష్టికి మూలం. లయకారుడు కూడా ఆయనే. శివతత్వం ఆధ్యాత్మికతకు మూలం. అది అర్థం చేసుకుని సాధన చెయ్యడమే మోక్షమార్గం. నాగుపాము, త్రిశూలం, చంద్రవంక, ఫాలనేత్రమూ శివ చిహ్నాలుగా భావిస్తారు. ఈ చిహ్నాలు పవిత్రమైనవి మాత్రమే కాదు... చాలా ప్రాముఖ్యత కలిగినవి కూడా. మానవ జీవితసారం, ఆధ్యాత్మికత అంతరార్థం ఈ చిహ్నాలలో దాగి ఉన్నాయి.
ఈశ్వరుడు తన సిగలో చంద్రవంకను ధరించాడు. అందుకే శివుడు చంద్రశేఖరుడు అని అంటారు. శివుని తలపై చంద్రుడు ఉండటం కాలాన్ని నియంత్రించే ఒక గొప్ప శక్తికి ప్రతీక. చంద్రుడు సమయాన్ని తెలియజేసే ఒక మీడియం. అటువంటి కాలాన్ని తల మీద ధరించిన వాడు శివుడు.
శివుడి మూడో కన్ను అతడి ఫాలభాగంలో ఉంటుంది. శివుడి మూడో కన్ను భౌతిక ప్రపంచానికి ఆవల అంతకు మించి ఉన్న అధిభౌతిక ప్రపంచానికి చిహ్నం. ఐదు జ్ఞానేంద్రియాలు మాత్రమే కాకుండా.. ఆరో జ్ఞానం. దీనినే ఇంగ్లీష్ లో సిక్త్ సెన్స్ గా చెప్పవచ్చు. అలాంటి సిక్స్త్ సెన్స్ కు ప్రతీక ఈ ఫాలనేత్రం. ఈ మూడోకన్ను వల్లనే శివుడు త్రయంబకుడు, అధిభౌతిక జ్ఞాన కారకుడు అయ్యాడు.
శివుడి చేతిలో త్రిశూలం ఆయుధంగా ధరించి ఉంటాడు. ఇది మానవ శరీరంలోని మూడు ప్రధాన నాడులకు ప్రతీక. అంతేకాదు శివుడి త్రిశూలం జీవితంలో కోరిక, పోరాట పటిమ, జ్ఞానాన్ని కూడా చూచిస్తుంది. శివుడి త్రిశూలం వంటి ఈ మూడింటిని సాధించడమే జీవిత పరమార్థం.
రుద్రాక్ష శివుడి కంటి నుంచి రాలిన నీటి బిందువులతో ఏర్పడిందని చెబుతారు. శివుడు సుదీర్ఘ ధ్యానం నుంచి మేలుకున్నపుడు ఆయన కంటి నుంచి రాలిన కన్నీటి చుక్క భూమిపై పడిందని అది పవిత్రమైన రుద్రాక్ష వృక్షంగా మారిందని పురాణ గాథ. రుద్రాక్ష మొత్తం సృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పవచ్చు.
పరమశివుడు తన మెడలో నాగుపామును ఆభరణంగా ధరిస్తాడు. అతడి మెడలో ఉండే నాగు మూడు సార్లు మెడ చుట్టు చుట్టుకుని ఉంటుంది. ఈ మూడు చుట్లు భూత, వర్తమాన, భవిష్యత్తులకు ప్రతీక. సర్పాన్ని ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా శివుడు తమోగుణ లోపాలు, రుగ్మతలను నియంత్రించేవాడు, లయకారుడు అనే విషయాన్ని రుజువు చేస్తుంది. సర్పం ప్రతి ఒక్కరిలో సుశుప్తంగా దాగి ఉన్న కుండలినీ శక్తికి కూడా ప్రతీక.
Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?
Chanakya Niti - చాణక్య నీతి: ఇలా సంపాదించే డబ్బు అస్సలు నిలవదు!
Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక రహస్యం ఇదే
Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం
Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్నట్టే !
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్
Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?