వంటగదిలో ఈ ఫొటో పెట్టుకుంటే దరిద్రం మీ దరిచేరదు
నిత్యం కడుపు నిండా తిండి తినేవాడు.. ఎప్పటికీ ఐశ్వర్యవంతుడే. ఆ ఐశ్వర్యం మీకూ దక్కాలంటే వంటగదిలో ఈ పటాన్ని పెట్టండి.
ప్రతి ఇంటికి వంటగది చాలా ముఖ్యమైంది. ఇది అన్నపూర్ణాదేవి స్థానం. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంట పూర్తయిన వెంటనే ఆ గదిని శుభ్రం చేసుకోవాలి. వంటగది శుభ్రంగా పెట్టుకోక పోతే అన్నపూర్ణా దేవి అలిగి వెళ్లిపోతుంది. క్రమంగా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. నెమ్మదిగా ఆహార నిల్వలు తగ్గిపోతాయి. రకరకాల సమస్యలు జీవితాన్ని చుట్టుముడుతాయి. శివుడితో కలిసి ఉండే అన్నపూర్ణ మాత చిత్రాన్ని వంటగది వెలుపల ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వివరాలు తెలుసుకుందాం.
⦿ ఇంట్లో ఆహార నిల్వలు ఎన్నటికీ తరిగిపోవు.
⦿ వంటింట్లో తయారైన ఆహారం ఆరోగ్యం అందించేదిగా ఉంటుంది.
⦿ వంట చేసే సమయంలో కోపం ద్వేషం వంటి అపవిత్ర భావనలు రాకుండా ఉంటాయి.
⦿ అక్కడ తయారైన ఆహారం ఆరోగ్యాన్ని అందించేదిగా ఉంటుంది.
⦿ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు నిలిచి ఉంటాయి.
⦿ ఈ చిత్రం వంటగదిలో ఎనర్జీని రెట్టింపు చేస్తుంది.
ప్రేమానురాగాలతో పాటు కుటుంబ వృద్ధి, మర్యాద పెరుగుతాయి.
ఇంట్లో ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తుంది.
అన్నపూర్ణ దేవి చిత్రాన్ని వంట గది బయట గోడకి అలంకరించుకున్నపుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి.
⦿ గురువారం, శుక్రవారం ఉదయం అన్నింటికంటే ముందుగా వంటగదిని శుభ్రం చేసుకోవాలి.
⦿ గంగా జలం అందుబాటులో ఉన్నవారు తప్పకుండా కాస్త గంగాజలం చల్లుకొని శుద్ధి చేసుకోవాలి
⦿ చిత్రాన్ని అతికించే ముందు ఆ గోడను శుభ్రం చేసి గంగాజలం(అందుబాటులో ఉంటే)తో శుద్ధి చెయ్యాలి.
⦿ గ్యాస్ స్టవ్ లేదా స్టవ్ మీద ఆహారాన్ని తయారుచేస్తాం. అందుకే తప్పనిసరిగా వంటతయారయ్యే పొయ్యిని తప్పనిసరిగా పూజించాలి. ఇది అన్నపూర్ణ దేవికి చేసే ఉపాసన అవుతుంది.
⦿ వంట గదిలో ఉన్న అన్నపూర్ణాదేవి సహితుడైన పరమేశ్వరుని పూజించడం వల్ల ఇంటిలో ఆహార కొరత ఎన్నటికీ ఏర్పడదు.
⦿ అన్నపూర్ణా స్తోత్రం, కథ, హారతి తర్వాత ఈ చిత్రాన్ని వంటగదికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహంతో ఇల్లు సమృద్ధిగా ఉంటుంది.
⦿ వంటింటి పొయ్యి మీద పసుపు, కుంకుమ, అక్షితలు, పువ్వులు, ధూపం, దీపం వెలిగించి పూజ పూర్తి చెయ్యాలి.
⦿ వంటగది లోనే అన్నపూర్ణ దేవి చిత్రపటం ముందు ఇంటిలో ఆయూరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరికను విన్నవించుకోవాలి.
⦿ తర్వాత మొదటిరోజు మొదటి వంట తయారైన తర్వాత అన్నదానం అంటే అవసరమున్న వారికి పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా అన్నపూర్ణదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తే తప్పక మంచి జరుగుతుంది.
స్నానం చేయకుండా వంట చేయకూడదా? దాని ప్రభావం ఎలా ఉంటుంది?
పూర్వం పొయ్యి వెలిగించగానే కర్రలుపెట్టి ముందు ఓ చుక్క నెయ్యి వేసి.. అగ్నిహోత్రుడికి నమస్కరించి గిన్నెపెట్టేవారు. మళ్లీ వంట పూర్తైన తర్వాత మరో చుక్క నెయ్యివేసి కొన్ని మెతుకులు అగ్నిహోత్రుడికి సమర్పించేవారు. సాధారణంగా ఆలోచనలు, తీరు, ప్రవర్తనా విధానం అన్నీ తినే భోజనం ఆధారంగానే ఉంటాయని చెబుతారు. ఇందుకు ఉదాహరణ ఏంటంటే... పండుగ రోజుల్లో ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి వంటచేసి దేవుడికి నివేదించి తింటారు. మిగిలిన రోజుల్లో ఇంట్లో పనంతా అయ్యాక స్నానం చేస్తారు. పండుగ రోజు తిన్న భోజనం మీలో సానుకూల ఆలోచనలు, దైవత్వాన్ని నింపితే.. స్నానం చేయకుండా వండిన వంటను తిన్నవారిలో ఆ సున్నితత్వం ఉండదని, శౌచం లేకుండా వండిన వంట తిన్నవారిలో రాక్షస ఆలోచనలే వస్తాయని పండితులు చెబుతున్నారు.