అన్వేషించండి

Bathukamma 2023: బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో చివ‌రి రోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ‌కు నివేద‌న‌ల‌తో ఘ‌నంగా వీడ్కోలు

Bathukamma 2023: తెలంగాణాలో కోలాహలంగా సాగే పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు సాగే ఈ వేడుక‌లో ముఖ్యమైన రోజు సద్దుల బతుకమ్మగా పూజించే చివ‌రి రోజు. ఈ రోజు అమ్మ‌వారికి ఎన్నో రకాల నైవేద్యాలు నివేదిస్తారు.

Bathukamma 2023: బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. అలసిన అమ్మవారికి భక్తులు ఘనమైన పాకాలు నివేదన చేస్తారు. ‘పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా’ అంటూ అమ్మకు రకరకాలైన నైవేద్యాలు పెడతారు.

గ్రామీణులు సద్దుల పేరుతో పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం ఇలా వివిధ రకాలైన సద్దులు చేస్తారు. అందుకే చివరి రోజు వేడుకకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా భిన్నంగా, పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు. సాయంత్రం కాగానే అందరూ బతుకమ్మ ఆడటానికి అందంగా ముస్తాబై కదలివస్తారు. మగవాళ్లు సైతం ఈ ముచ్చటను చూసేందుకు ఉత్సాహం కనబరుస్తారు. ఊరంతా చెరువు కట్టకు ఊరేగింపుగా తరలివెళ్తారు. ‘తంగేడు పూవుల్ల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ.. పోతె పోతివిగాని చందమామ.. మళ్లెప్పుడొస్తావు చందమామ.. ఏడాదికోసారి చందమామ.. నువ్వొచ్చి పోవమ్మ చందమామ’ అంటూ తమకు బతుకునిచ్చిన పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.

తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ
నైవేద్యం : కొబ్బరన్నం, నువ్వుల సద్ది, నిమ్మకాయ పులిహోర‌, చింతపండు పులిహోర, దద్దోజనం... ఇలా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

Also Read : మీ మేని ఛాయను మెరుగుపరిచే పూలు ఇవి - బతుకమ్మని తయారు చేయడంలో స్పెషల్ అట్రాక్షన్ ఇవే!

మొద‌టి రోజు : ఎంగిలిపూల బతుకమ్మ
నైవేద్యం - నువ్వుల పిండి, బియ్యం పిండితో చేసే ప్రసాదం
తయారీ విధానం: కప్పు నువ్వులు తీసుకుని కడాయిలో వేయించాలి. గోధుమ‌ రంగులోకి వచ్చాక తీసి పంచదార వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యంపిండి, నూకలు కూడా కలుపుకోవచ్చు. ఇదే ఎంగిలిపూల బతుకమ్మకు సమర్పించే నైవేద్యం.

రెండో రోజు: అటుకుల‌ బతుకమ్మ
నైవేద్యం: స‌ప్పిడి పప్పుతో పాటు బెల్లం - అటుకులు     
తయారీ: ముందుగా స‌ప్పిడి పప్పు తయారుచేసుకోవాలి. కందిపప్పుకు కాస్త పసుపు కలిపి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నెయ్యితో ఆ పప్పును తాళింపు వేసుకోవాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేయకూడదు. ఇది చప్పిడి పప్పు కాబట్టి కారం ఉండకూడదు. 

ఇక బెల్లం-అటుకుల రెసిపీ కోసం ముందుగా కడాయిలో నెయ్యివేసి  జీడిపప్పులు, కిస్మిస్, బాదం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో బెల్లం వేసి కరిగించుకోవాలి. అవి కరిగాక అటుకులను శుభ్రం చేసి మరీ మెత్తగా నానిపోకుండా తీసి బెల్లంలో వేసి కలిపేయాలి. పైన ముందుగా వేయించిన డ్రైఫ్రూట్స్‌ను చల్లుకోవాలి. అంతే బెల్లం-అటుకుల ప్రసాదం రెడీ. 

మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నైవేద్యం: ముద్దపప్పు
తయారీ: కుక్కర్లో కందిపప్పు, పసుపు, కరివేపాకులు, దంచిన జీలకర్ర, ఒక స్పూను నూనె, నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాక ఉప్పు కలుపుకోవాలి. ముద్దప‌ప్పు ప్రసాదం సిద్ధమైనట్టే.

నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం: బెల్లం అన్నం లేదా పరమాన్నం
తయారీ విధానం: ఒక కప్పు బియ్యాన్ని మూడు కప్పుల పాలలో ఉడికించాలి. పాలలో బియ్యం ఉడకవు అనుకుంటే రెండు ఒకటిన్నర కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు పోయచ్చు. మరో పక్క కడాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అలాగే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికాక చివర్లో కరిగించిన బెల్లం పాకాన్ని వేసి కలపాలి. స్టవ్ ఆపేయాలి. బెల్లంగా బాగా కలిశాక పైన ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే బెల్లం అన్నం సిద్ధం.

ఐదో రోజు: అట్ల బతుకమ్మ
నైవేద్యం:  అట్లు లేదా దోశెలు
తయారీ: ఈ రోజు ప్రసాదం చేయడం చాలా సులువు. ఇంట్లో రోజూ చేసుకునే అట్లు లేదా దోశెలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బియ్యంపిండితో చేసిన అట్లు పెడితే మంచిదని చెబుతారు. దీనికి ఒక గిన్నెలో  కప్పు బియ్యంపిండి, పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, జీలకర్ర, తగినంత నీళ్లు వేసి బాగా కలపాలి. దోశె పిండిలా జారేలా కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టాక ఆ పిండితో అట్లు లేదా దోశెలు వేసి అమ్మవారికి సమర్పించాలి.

ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
నైవేద్యం: ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు.

Also Read : బతుకమ్మ పూలను శివలింగాకృతిలో ఎందుకు పేరుస్తారో తెలుసా!

ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ
నైవేద్యం: బియ్యంపిండితో చేసే వేపకాయలు ప్రసాదం
తయారీ: ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యంపిండి, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అందులో గోరువెచ్చని నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ ముద్దను వేపకాయల్లా చేతితో నొక్కుకుని నూనెలో వేయించాలి. అంతే వేపకాయల ప్రసాదం సిద్ధం. 

ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
నైవేద్యం: వెన్నముద్దలు
తయారీ: వెన్నముద్దలు చేసేందుకు గిన్నెలో అరకప్పు బియ్యంపిండి వేయాలి. అందులో రెండు స్పూన్ల వెన్న‌, కాస్త వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా వచ్చే వరకు క‌లపాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసి గులాబ్ జాముల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. అలా గుండ్రని ముద్దలు త‌యార‌య్యాక వాటిని నూనెలో వేయించాలి. మరో పక్క పంచదార పాకం త‌యారుచేసుకుని, వేయించిన వెన్నముద్దలను తీసి ఆ పాకంలో వేయాలి. అంతే.. అమ్మవారికి తీయని వెన్నముద్దల నైవేద్యం సిద్ధ‌మైనట్టే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Allu Arha - Allu Arjun: మనుచరిత్రలో పద్యం చెప్పిన అల్లు అర్హ ..ఆ పద్యానికి భావం, సందర్భం ఏంటో తెలుసా!
మనుచరిత్రలో పద్యం చెప్పిన అల్లు అర్హ ..ఆ పద్యానికి భావం, సందర్భం ఏంటో తెలుసా!
Unhappy Leave : మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే
మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే
Mahasena Rajesh: కూటమి ప్రభుత్వంలోనూ తప్పుడు కేసులు! మహాసేన రాజేష్‌ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంలోనూ తప్పుడు కేసులు నమోదు! మహాసేన రాజేష్‌ సంచలన వ్యాఖ్యలు
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
Embed widget