అన్వేషించండి

Batukamma 2023: 8వ రోజు వెన్న‌ముద్ద‌ల బ‌తుకమ్మ‌కు నివేదించే వాయ‌నం ఇదే!

Batukamma 2023: తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో ఎనిమిదవ రోజు బతుకమ్మ పండుగను వెన్నముద్దల బతుకమ్మగా జరుపుకొంటారు. ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు, బెల్లంతో చేసిన వంటకాన్ని నివేదిస్తారు.

Batukamma 2023: భూమి, నీరు.. ప్రకృతి మధ్య సంబంధాన్ని తెలుపుతూ జరుపుకొనే పండుగ బ‌తుక‌మ్మ‌. అంటు వ్యాధుల నుంచి కరువు కాటకాల నుంచి, పాడి పంటలు బాగా ఉండాలని, ప్రజలను కాపాడాలని ప్రార్థిస్తూ ఆడ‌ప‌డుచులు గౌరమ్మను ఆటపాటలతో అలరిస్తూ, పూజించే వేడుక‌. ఎనిమిదో రోజు బ‌తుక‌మ్మ‌ను తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు పూలతో మరింత ఎత్తుగా అంటే ఎనిమిది అంతరాలుగా వెన్నముద్దల బతుకమ్మగా పేర్చి..ఇంటి దగ్గర కాకుండా దేవాలయం దగ్గర ఆడబిడ్డలంతా చేరి ఆట, పాటలతో బతుకమ్మను కొలుచుకుని చెరువులో నిమజ్జనం చేస్తారు. వెన్నముద్దల బతుకమ్మ కోసం ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు మరియు బెల్లంతో చేసిన వంటకాన్ని తయారు చేస్తారు. అందుకే ఈ రోజును వెన్నముద్దల బతుకమ్మ అని అంటారు. ఈ రోజున వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా ఇచ్చిపుచ్చుకుంటారు.

ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
నైవేద్యం: వెన్నముద్దలు
తయారీ: వెన్నముద్దలు చేసేందుకు గిన్నెలో అరకప్పు బియ్యంపిండి వేయాలి. అందులో రెండు స్పూన్ల వెన్న‌, కాస్త వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా వచ్చే వరకు క‌లపాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసి గులాబ్ జాముల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. అలా గుండ్రని ముద్దలు త‌యార‌య్యాక వాటిని నూనెలో వేయించాలి. మరో పక్క పంచదార పాకం త‌యారుచేసుకుని, వేయించిన వెన్నముద్దలను తీసి ఆ పాకంలో వేయాలి. అంతే.. అమ్మవారికి తీయని వెన్నముద్దల నైవేద్యం సిద్ధ‌మైనట్టే.

Also Read : బతుకమ్మ పూలను శివలింగాకృతిలో ఎందుకు పేరుస్తారో తెలుసా!

మొద‌టి రోజు : ఎంగిలిపూల బతుకమ్మ
నైవేద్యం - నువ్వుల పిండి, బియ్యం పిండితో చేసే ప్రసాదం
తయారీ విధానం: కప్పు నువ్వులు తీసుకుని కడాయిలో వేయించాలి. గోధుమ‌ రంగులోకి వచ్చాక తీసి పంచదార వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యంపిండి, నూకలు కూడా కలుపుకోవచ్చు. ఇదే ఎంగిలిపూల బతుకమ్మకు సమర్పించే నైవేద్యం.

రెండో రోజు: అటుకుల‌ బతుకమ్మ
నైవేద్యం: స‌ప్పిడి పప్పుతో పాటు బెల్లం - అటుకులు     
తయారీ: ముందుగా స‌ప్పిడి పప్పు తయారుచేసుకోవాలి. కందిపప్పుకు కాస్త పసుపు కలిపి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నెయ్యితో ఆ పప్పును తాళింపు వేసుకోవాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేయకూడదు. ఇది చప్పిడి పప్పు కాబట్టి కారం ఉండకూడదు. 

ఇక బెల్లం-అటుకుల రెసిపీ కోసం ముందుగా కడాయిలో నెయ్యివేసి  జీడిపప్పులు, కిస్మిస్, బాదం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో బెల్లం వేసి కరిగించుకోవాలి. అవి కరిగాక అటుకులను శుభ్రం చేసి మరీ మెత్తగా నానిపోకుండా తీసి బెల్లంలో వేసి కలిపేయాలి. పైన ముందుగా వేయించిన డ్రైఫ్రూట్స్‌ను చల్లుకోవాలి. అంతే బెల్లం-అటుకుల ప్రసాదం రెడీ. 

మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నైవేద్యం: ముద్దపప్పు
తయారీ: కుక్కర్లో కందిపప్పు, పసుపు, కరివేపాకులు, దంచిన జీలకర్ర, ఒక స్పూను నూనె, నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాక ఉప్పు కలుపుకోవాలి. ముద్దప‌ప్పు ప్రసాదం సిద్ధమైనట్టే.

నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం: బెల్లం అన్నం లేదా పరమాన్నం
తయారీ విధానం: ఒక కప్పు బియ్యాన్ని మూడు కప్పుల పాలలో ఉడికించాలి. పాలలో బియ్యం ఉడకవు అనుకుంటే రెండు ఒకటిన్నర కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు పోయచ్చు. మరో పక్క కడాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అలాగే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికాక చివర్లో కరిగించిన బెల్లం పాకాన్ని వేసి కలపాలి. స్టవ్ ఆపేయాలి. బెల్లంగా బాగా కలిశాక పైన ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే బెల్లం అన్నం సిద్ధం.

ఐదో రోజు: అట్ల బతుకమ్మ
నైవేద్యం:  అట్లు లేదా దోశెలు
తయారీ: ఈ రోజు ప్రసాదం చేయడం చాలా సులువు. ఇంట్లో రోజూ చేసుకునే అట్లు లేదా దోశెలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బియ్యంపిండితో చేసిన అట్లు పెడితే మంచిదని చెబుతారు. దీనికి ఒక గిన్నెలో  కప్పు బియ్యంపిండి, పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, జీలకర్ర, తగినంత నీళ్లు వేసి బాగా కలపాలి. దోశె పిండిలా జారేలా కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టాక ఆ పిండితో అట్లు లేదా దోశెలు వేసి అమ్మవారికి సమర్పించాలి.

ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
నైవేద్యం: ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు.

Also Read : బతుకమ్మలో వినియోగించే ఈ పువ్వు విషపూరితమే కానీ ఉపయోగాలున్నాయి!

ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ
నైవేద్యం: బియ్యంపిండితో చేసే వేపకాయలు ప్రసాదం
తయారీ: ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యంపిండి, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అందులో గోరువెచ్చని నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ ముద్దను వేపకాయల్లా చేతితో నొక్కుకుని నూనెలో వేయించాలి. అంతే వేపకాయల ప్రసాదం సిద్ధం. 

తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ
నైవేద్యం : కొబ్బరన్నం, నువ్వుల సద్ది, నిమ్మకాయ పులిహోర‌, చింతపండు పులిహోర, దద్దోజనం... ఇలా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget