లలితా సహస్రనామం పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ, కళ ల్లోప్రావీణ్యాన్నీ, కుటుంబ సంతోషాన్ని, సంపదనూప్రసాదిస్తుందనీ భక్తుల విశ్వాసం.
సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో దర్శనమిస్తుంది లలితా దేవి
చెరుకుగడను చేతపట్టుకుని కూర్చున్న లలితా త్రిపుల సుందరిని దర్శించుకున్నవారికి ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది
భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. తపో నిష్టకు మెచ్చి ప్రత్యక్ష మైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు
ఎవరైనాతనతోయుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థిబలంలో సగం తనకు రావాలనీ, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు.
ఆ వరగర్వంతో విజృంభించిన భండాసురుడు తనసోదరు లతో కలిసిమూడులోకాలనూపీడిం చడం మొదలుపెట్టాడు
ఆ బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతనుఆరాధించారు. మహాయాగం చేశారు. ఆ హోమగుండం నుంచి ఉద్భవించంది శ్రీ లలితాదేవి.