దసరా 2023: 'దుర్గ' ఈ రెండక్షరాలు ఎందుకు పవర్ ఫుల్



దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గమ్మ. లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అని ఒక నామం ఉంది.



గత జన్మలలో వాసనల వల్ల ఈ జన్మలో దుష్ట విషయాలపై ఆసక్తి కలిగిఉంటారు. ఆ తల్లిని ఉపాసిస్తే దుర్గుణాలను సుగుణాలుగా మార్చేస్తుంది.



నిత్యం 'దుర్గా' అనే నామాన్ని ఎవరు స్మరిస్తారో వారు సద్గతి వైపు ప్రయాణం చేస్తారు.‘దుర్గా’ అంటే దుంఖం దూరమవుతుంది.



ఓం దుం దుర్గాయైనమః ద్ + ఉ + ర్ + గ్ + అ అనే ఐదు బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ



'ద' కారం - దైత్యాన్ని ( మనిషిలో ఉన్న రాక్షస గుణాలను) పోగోడుతుంది



'ఉ' కారం - తలపెట్టిన పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది



'ర' కారం- రోగాలు రాకుండా రక్షిస్తుంది
'గ' కారం- చేసిన పాపాలను పోగొడుతుంది



'అ' కారం - శత్రు నాశనం చేస్తుంది.



అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు.




Image Credit: Pinterest