అన్వేషించండి

Jwala Thoranam: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు దాటాలి.. విశిష్టత ఏంటి.. కాలిన గడ్డి తీసుకొచ్చి ఏం చేయాలి!

Jwala Thoranam 2024 Date: కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఈ తోరణం కిందనుంచి దాటాలని పోటీపడతారు భక్తులు. ఇంతకీ జ్వాలాతోరణం విశిష్టత ఏంటో తెలుసా..

Significance of Jwala Thoranam : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం నవంబరు 15న వచ్చాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే..అయినప్పటికీ క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం విశిష్టతే వేరు. ఏటా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఓ ప్రత్యేకత ఉంది. 

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల బయట రెండు కర్రలు నాటి వాటిపై అడ్డుగా మరో కర్ర పెడతారు. దానిపై ఎండుగడ్డిని తోరణంలా వేస్తారు. దీనినే యమద్వారం అని పిలుస్తారు. ఈ గడ్డిపై నెయ్యి పోసి మంట వెలిగిస్తారు. ఆ జ్వాల కిందనుంచి పల్లకిలో శివయ్యను మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ తర్వాత ఆ జ్వాల కిందనుంచి దాటేందుకు భక్తులు పోటీపడతారు. 

జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారంటే.. యమలోకంలో అడుగుపెట్టిన వెంటనే మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తీ అగ్ని తోరణాన్ని దాటుకునే వెళ్లాలి. పాపాత్ములకు వేసే ప్రధమ శిక్ష ఇది. అందుకే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే కార్తీకపౌర్ణమి రోజు శివాలయాల బయట నిర్వహించే జ్వాలాతోరణం దాటాలి. కార్తీక పౌర్ణమి రోజు యమద్వారం నుంచి మూడుసార్లు దాటితే వారికి యమలోకంలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉండదు. 

Also Read: అరుణాచలంలో కార్తీక పౌర్ణమి శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!

శివుడి ఊరేగింపుతో పాటూ జ్వాలాతోరణం కింద నడిచినప్పుడు... పరమేశ్వరా ఇప్పటివరకూ చేసిన పాపాలు ఈ మంటల్లో దహనమైపోవాలి ఇకపై ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేలా అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. 

జ్వాలాతోరణం భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటే భూత ప్రేత పిశాచాల బాధలు తొలగిపోతాయి. జ్వాలాతోరణం దర్శనం వల్ల పునర్జన్మ ఉండదంటారు పండితులు
 
అమృతం కోసం క్షీరసముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది. సమస్త సృష్టిని నాశనం చేసే ఆ విషం నుంచి కాపాడమని దేవతలంతా పరమేశ్వరుడిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి అనుమతితో శివుడు ఆ విషాన్ని సేవించాడు. ఆ సమయంలో తన భర్తకు ఎలాంటి మృత్యువు దరిచేరకూడదని భావించి పార్వతీదేవి జ్వాలాతోరణానికి నమస్కరించిందని చెబుతారు. అందుకే జ్వాలాతోరణం దాటినా, చూసి నమస్కరించుకున్నా అపమృత్యుభయం తొలగిపోతుందని పండితులు చెబుతారు. 

Also Read: కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్!
 
జ్వాలాతోరణం పూర్తిగా కాలిన తర్వాత ఆ గడ్డిని తీసుకొచ్చి ఇంట్లో, ధాన్యాగారంలో పెడతారు. ఈ గడ్డి ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు అడుగుపెట్టలేవు. ఈ గడ్డి ఉన్నచోట సుఖశాంతులు లభిస్తాయి. 

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!

వెలిగించి దీప శిఖలో శివ కేశవులను ఆవాహనం చేసి దీపానికి అక్షింతలు వేసి నమస్కరించాలి. జ్వారా తోరణం రోజు వెలిగించే దీపానికి చాలా విశిష్టత ఉంది.  పురుగులు, దోమలు, ఈగలు ఇలాంటి ఏ కీటకాలు అయినా దీపం వైపు ఎగిరివస్తే మోక్షం తథ్యం. దీపం వెలుగు ఎంత దూరం పడుతుందో..ఆ దీపాన్ని ఎవరెవరు చూస్తున్నారో అవన్నీ మరణానంతరం భగవంతుడి సన్నిధికి చేరుకుంటాయని అర్థం. 

Also Read: పౌర్ణమి రోజు వింత కాంతి..చీకటి పడగానే మాయమయ్యే శివలింగం - ఈ ఆలయ దర్శనం సాహసయాత్రే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget