Kanya Sankranti 2025: కన్యా సంక్రాంతి రోజు ఈ పనులు చేయండి! సూర్య భగవానుడు డబ్బు , ఆరోగ్యం, అధికారం ఇస్తాడు!
Kanya Sankranti Upay : సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం, విజయం, సంపద లభిస్తాయి.

Kanya Sankranti 2025 Upay: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తాయి. కానీ గ్రహాల గమనంలో సూర్యుని గమనం ముఖ్యమైనదిగా , శుభప్రదంగా పరిగణిస్తారు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో, ఆ రోజున ఆ రాశి పేరుతో సంక్రాంతి జరుపుకుంటారు.
2025 సెప్టెంబర్ 17 బుధవారం సూర్యుడు సింహ రాశిలో యాత్రను పూర్తి చేసి బుధుడికి చెందిన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు కన్యా సంక్రాంతి జరుపుకుంటారు. కన్యా సంక్రాంతి శుభ దినాన మీరు కొన్ని చర్యలు తీసుకుంటే, అది మీ అదృష్టాన్ని మార్చవచ్చు.
సూర్య దేవుని మూల మంత్రం పఠించండి
‘ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య: శ్రీం।’ ఇది సూర్య దేవుని మూల మంత్రం. కన్యా సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
ఆదిత్య హృదయ స్తోత్రం
కన్యా సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించండి. ఆ తర్వాత పూజలు చేసి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. ఇది మీ వ్యాపారంలో వేగాన్ని పెంచుతుంది , ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది.
దానం చేయండి
కన్యా సంక్రాంతి రోజున గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు దుస్తులు వంటి సూర్య భగవానుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల కెరీర్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.
సూర్య దేవుని నామాలను జపించండి
కన్యా సంక్రాంతి రోజున సూర్య భగవానుడి 108 నామాలను జపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి, ఆపై ఈ నామాలను జపించండి. ఇది కెరీర్ వ్యాపారంలో విజయాన్ని అందిస్తుంది. ఆరోగ్యాన్ని అందిస్తాడు
- ఓం నిత్యానందాయ నమః।
- ఓం నిఖిలాగమవేద్యాయ నమః।
- ఓం దీప్తమూర్తయే నమః।
- ఓం సౌఖ్యదాయినే నమః।
- ఓం శ్రేయసే నమః।
- ఓం శ్రీమతే నమః।
- ఓం అం సుప్రసన్నాయ నమః।
- ఓం ఐం ఇష్టార్థదాయ నమః।
- ఓం సంపత్కరాయ నమః।
- ఓం హిరణ్యగర్భాయ నమః।
- ఓం తేజోరూపాయ నమః।
- ఓం పరేశాయ నమః।
- ఓం నారాయణాయ నమః।
- ఓం కవయే నమః।
- ఓం సూర్యాయ నమః।
- ఓం సకలజగతాంపతయే నమః।
- ఓం సౌఖ్యప్రదాయ నమః।
- ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః।
- ఓం భాస్క రాయ నమః।
- ఓం గ్రహాణాం పతయే నమః।
- ఓం వరేణ్యాయ నమః।
- ఓం తరుణాయ నమః।
- ఓం పరమాత్మనే నమః।
- ఓం హరయే నమః।
- ఓం రవయే నమః।
- ఓం అహస్క రాయ నమః।
- ఓం పరస్మై జ్యోతిషే నమః।
- ఓం అమరేశాయ నమః।
- ఓం అచ్యుతాయ నమః।
- ఓం ఆత్మరూపిణే నమః।
- ఓం అచింత్యాయ నమః।
- ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః।
- ఓం అబ్జ వల్లభాయ నమః।
- ఓం కమనీయకరాయ నమః।
- ఓం అసురారయే నమః।
- ఓం ఉచ్చస్థాన సమారుఢరథస్థాయ నమః।
- ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః।
- ఓం జగదానందహేతవే నమః।
- ఓం జయిని నమః।
- ఓం ఓజస్క రాయ నమః।
- ఓం భక్తవశ్యాయ నమః।
- ఓం దశదిక్సంప్రకాశాయ నమః।
- ఓం శౌర్యే నమః।
- ఓం హరిదశ్వాయ నమః।
- ఓం శర్వాయ నమః।
- ఓం ఐశ్వర్యదాయ నమః।
- ఓం బ్రహ్మణే నమః।
- ఓం బృహతే నమః।
- ఓం ఘృణిభృతే నమః।
- ఓం గుణాత్మనే నమః।
- ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః।
- ఓం భగవతే నమః।
- ఓం ఏకాకినే నమః।
- ఓం ఆర్తశరణ్యాయ నమః।
- ఓం అపవర్గప్రదాయ నమః।
- ఓం సత్యానందస్వరూపిణే నమః।
- ఓం లునితాఖిలదైత్యాయ నమః।
- ఓం ఖద్యోతాయ నమః।
- ఓం కనత్కనకభూషాయ నమః।
- ఓం ఘనాయ నమః।
- ఓం కాంతిదాయ నమః।
- ఓం శాంతాయ నమః।
- ఓం లుప్తదంతాయ నమః।
- ఓం పుష్కరాక్షాయ నమః।
- ఓం ఋక్షాధినాథమిత్రాయ నమః।
- ఓం ఉజ్జ్వలతేజసే నమః।
- ఓం ఋకారమాతృకావర్ణరూపాయ నమః।
- ఓం నిత్యస్తుత్యాయ నమః।
- ఓం ఋజుస్వభావచిత్తాయ నమః।
- ఓం ఋక్షచక్రచరాయ నమః।
- ఓం రుగ్ఘంత్రే నమః।
- ఓం ఋషివంద్యాయ నమః।
- ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః।
- ఓం జయాయ నమః।
- ఓం నిర్జరాయ నమః।
- ఓం వీరాయ నమః।
- ఓం ఊర్జస్వాలాయ నమః।
- ఓం హృషీకేశాయ నమః।
- ఓం ఉద్యత్కిరణజాలాయ నమః।
- ఓం వివస్వతే నమః।
- ఓం ఊర్ధ్వగాయ నమః।
- ఓం ఉగ్రరూపాయ నమః।
- ఓం ఉజ్జ్వల నమః।
- ఓం వాసుదేవాయ నమః।
- ఓం వసవే నమః।
- ఓం వసుప్రదాయ నమః।
- ఓం సువర్చసే నమః।
- ఓం సుశీలాయ నమః।
- ఓం సుప్రసన్నాయ నమః।
- ఓం ఈశాయ నమః।
- ఓం వందనీయాయ నమః।
- ఓం ఇందిరామందిరాప్తాయ నమః।
- ఓం భాన్వే నమః।
- ఓం ఇంద్రాయ నమః।
- ఓం ఇజ్యాయ నమః।
- ఓం విశ్వరూపాయ నమః।
- ఓం ఇనాయ నమః।
- ఓం అనంతాయ నమః।
- ఓం అఖిలజ్ఞాయ నమః।
- ఓం అచ్యుతాయ నమః।
- ఓం అఖిలాగమవేదినే నమః।
- ఓం ఆదిభూతాయ నమః।
- 103 ఓం ఆదిత్యాయ నమః।
- ఓం ఆర్తరక్షకాయ నమః।
- ఓం అసామానబలాయ నమః।
- ఓం కరుణారససింధవే నమః।
- ఓం శరణ్యాయ నమః।
- ఓం అరుణాయ నమః।
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















