7 Paranormal Myths: పాలగిన్నె మూత తీసినా, కుక్క ఏడ్చినా ఆత్మలకు ఆహ్వానం పలికినట్టే! తరచూ వినిపించే 7 మూఢనమ్మకాలు - వాటి వెనుకున్న ఆశ్చర్యపోయే వాస్తవాలు!
7 Paranormal Superstitions: కొన్ని పెద్దలు చెప్పారని పాటిస్తుంటారు..కానీ వాటి వెనుకున్న అసలు కారణాలు ఏంటన్నది కొందరికే తెలుసు. అలా రెగ్యులర్ గా వినే కొన్ని నమ్మకాలు ..వాటి వెనుకున్న అసలు కారణాలు ఇవే!

7 Paranormal Myths
గ్రహణం సమయంలో భోజనం చేయకూడదు
పాలపై మూత పెట్టకుండా ఉంచితే ఆత్మలు వస్తాయి
సూర్యాస్తమయం తర్వాత చీపురు వాడకూడదు
చీకటి పడ్డాక గోర్లు కత్తిరించుకోకూడదు..
రాత్రి సమయంలో విజిల్ వేస్తే ఆత్మలను ఆకర్షించినట్టే
కుక్కలు రాత్రివేళ అరిస్తే ఏదో అరిష్టం జరగబోతోంది
రావిచెట్టుకింద రాత్రివేళ నిద్రిస్తే ఆత్మలతో సహవాసం చేసినట్టే
ఇవీ..
కొన్ని తరాలుగా జనం మధ్య ఉండిపోయిన నమ్మకాలు..కొందరి దృష్టిలో మూఢనమ్మకాలు. అయితే ఇవి నమ్మకమా మూఢ నమ్మకమా అన్నది కాదు అసలు అప్పట్లో వీటిని ఎందుకు అనుసరించేవారో తెలుసా?
ఇప్పటికీ చాలా ఇళ్లలో సాయంత్రం..సూర్యాస్తమయం తర్వాత చీరుపు వినియోగించకూడదు అని చెబుతుంటారు. అలా చేయడం వల్ల ఇంటికి శ్రేయస్సు దూరమవుతుందంటారు. కానీ దీని వెనుక ఉన్న నిజం ఏంటంటే..పూర్వకాలం లైట్లు ఉండేవి కాదు. దీపం వెలిగించేవారు. ఆ మసక వెలుగులో ఇల్లు ఇల్లు ఊడిస్తే ఏవైనా వస్తువులు పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు విలువైన వస్తువులు కూడా అందులో ఉండొచ్చు. అందుకే చీకటి పడ్డాక ఇల్లు ఊడ్చొద్దని చెప్పేవారు
రాత్రి సమయంలో పాల గిన్నె మూత తీసి ఉంచితే వాటిని తాగేందుకు ఆత్మలు వస్తాయని కొందరి భయం. వాస్తవానికి పాలపై మూత పెట్టకుండా ఉంటే అవి త్వరగా పాడవుతాయి..పురుగులను ఆకర్షిస్తాయి..విషపూరితంగా మారిపోతాయి. అందుకే పాలపై మూత పెట్టకుండా ఉంచకూడదు. అందులో భాగంగా ఇలా చెప్పారు అంతే.
'గ్రహణ కాలంలో భోజనం చేయకూడదు' ఇది ఇప్పటికీ చాలామంది అనుసరిస్తుంటారు. అయితే గ్రహణం సమయంలో భోజనం చేస్తే ఏదో జరిగిపోతుందని కాదు. సూర్య చంద్రుల కిరణాలు భూమ్మీదపడనప్పుడు విషపు గాలులు త్వరగా వ్యాపిస్తాయి. వాతావరణం కలుషితంగా మారుతుంది. ఆ సమయంలో నిల్వ ఉంచిన ఆహారంపై ఆ ప్రభావం ఉంటుంది.అలాంటి ఆహారం తింటే అనారోగ్యంపాలవుతారు. అందుకే గ్రహణ సమయంలో తినకూడదు, వండకూడదు..ఆ సమయంలో నిల్వ ఉంచిన ఆహారం ఆ తర్వాత కూడా తినకూడదని చెబుతారు.
రాత్రి సమయంలో విజిల్ వేయడం వల్ల ఆత్మలు మీవైపు ఆకర్శితులవుతాంటారు.. వాస్తవానికి రాత్రి సమయంలో విజిల్ వేస్తే దొంగలను అలర్ట్ చేసినట్టవుతుంది. అదే సమయంలో గ్రామాల్లో గస్తీ కాసేవారు విజిల్స్ వేస్తే..సమీపంలో ఉన్న పొదలు, అడవి నుంచి జంతువులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రాత్రిపూట విజిల్ వేయొద్దని చెప్పేవారు
సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించుకోవడం వల్ల జీవితంలో దురదృష్టం వస్తుందంటారు. చీకటిపడ్డాక గోర్లు కట్ చేయనేకూడదని చెబుతారు. వాస్తవానికి సాయంత్రం లేదా చీకటిలో గోర్లు కత్తిరించుకోవడం వల్ల తరచుగా గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండేది. అందుకే కాలక్రమేణా ఇది ఒక అసాధారణ హెచ్చరికగా మారింది
రాత్రి సమయంలో రావి చెట్టు కింద నిద్రించకూడదు.. ఎందుకంటే ఆత్మలు అక్కడ నివసిస్తాయి..ఇది కొందరి నమ్మకం. వాస్తవానికి ఇది పూర్తిగా కట్టుకథ. రావి చెట్టు రాత్రి సమయంలో కార్బన్ డైయాక్సైడ్ విడుదల చేస్తుంది. దీనివల్లఈ చెట్టు కింద నిద్రించేవారు తీవ్ర అనారోగ్యానిక గురవుతారు, ఒక్కోసారి మరణించే ప్రమాదం కూడా ఉంది. అందుకే దీనిని దయ్యాలతో ముడిపెట్టారు.
రాత్రి సమయంలో కుక్కలు ఏడవడం అశుభం అంటారు. ఏదో కీడు జరగబోతోందని చెబుతుంటారు. నిజానికి కుక్కల ఇంద్రియాలు చాలా చురుకుగా వేగంగా ఉంటాయి. అవి తమ చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులను కూడా పసిగట్టగలవు. తన చుట్టూ ఉండే మార్పులను గ్రహిస్తూ కుక్కలు అలా అరుస్తాయి..దీన్ని కూడా మూఢనమ్మకంగా మార్చేశారు






















