News
News
X

Horoscope 8th July 2022: ఈ రాశివారు అస్సలు రిస్క్ చేయొద్దు, ఈ రెండు రాశులవారిపై లక్ష్మీదేవి కరుణ, జులై 8 రాశి ఫలాలు

Horoscope 08-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

జులై 8 శుక్రవారం రాశిఫలాలు (Horoscope 08-07-2022)  

మేషం
నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. విద్యార్థులు మీ సమస్యలు మీరే పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందొచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. షేర్ మార్కెట్ నుంచి లాభం వస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎవ్వరికీ సలహా ఇవ్వకండి. 

వృషభం
జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి మీ చేతికందుతాయి. మీ అభిప్రయాన్ని గౌరవిస్తారు. వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మీ సలహాలు కొందరికి మంచి చేస్తాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగవు.

మిథునం
ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీ నైపుణ్యత కారణంగా పనిని సులభంగా చేయగలుగుతారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కష్టపడితేనే వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు.ఎవరితోనైనా వాగ్వాదం జరగొచ్చు. మీకోపాన్ని నియంత్రించుకోండి. 

Also Read: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!

కర్కాటకం
కొత్త టెక్నాలజీ నేర్చుకుంటారు.శత్రువులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యాపార ప్రణాళిక విజయవంతమవుతుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కార్యాలయంలో వర్క్ హెవీగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

సింహం
ఈ రోజు మీకు విజయవంతమైన రోజు అవుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులు పొందగలరు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో పెద్ద మార్పులు ఉండొచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.

కన్యా
ఈ రోజు ఎవరికీ సలహా ఇవ్వకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వృత్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిలిచిపోయిన మొత్తం చేతికందుతుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పని సులభంగా పూర్తవుతుంది. ఆఫీసులో అధికారుల ఒత్తిడిని తట్టుకోగలరు. బంధువులను కలుస్తారు.

Also Read: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!

తులా 
సామాజిక రంగంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ వ్యాపారం పురోగమిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఆనందకరమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఓ శుభవార్త వింటారు.

వృశ్చికం
ఈ రోజంతా ఒత్తిడితో నిండి ఉండొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోకండి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. దినచర్యను ఆరోగ్యంగా, క్రమబద్ధంగా ఉంచండి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఈరోజంతా ఏకాంతంలో ఉండాలనుకుంటారు. ఒకరి మాటలు మిమ్మల్ని బాధపెడతాయి. బంధువుల నుంచి విచారకరమైన వార్తలు వింటారు. విద్యార్థులకు శుభసమయం. 

ధనుస్సు 
ఈ రోజు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చకండి. రిస్క్ తీసుకోవద్దు.  ఆఫీసు వ్యవహారాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి.కొంతమంది మీ మాటల వల్ల ప్రభావితమవుతారు. పూర్వ మిత్రులను కలుస్తారు. ఖర్చులు అదుపులో ఉండాలి.

Also Read: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

మకరం
ఈ రోజు మీకు ప్రత్యేకంగా నిలుస్తుంది. మీ కుటుంబ సభ్యుల విజయాన్ని చూసి మీరు గర్వపడతారు. కుటుంబ సభ్యులందరూ మీ  మాటలను గౌరవిస్తారు.అవివాహితులకు వివాహ విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ప్రేమికులకు మంచి రోజు. ఓ శుభవార్త వింటారు.

కుంభం
ఈ రోజు మీరు కొత్త ఆదాయ అవకాశాలు పొందుతారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. పై అధికారులు మిమ్మల్ని చూసి అసూయపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. పాత మిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి.

మీనం
ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. తెలివైన వ్యక్తుల వల్ల మీరు డబ్బును కోల్పోవచ్చు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఒకరి మాటలు నమ్మి  మీ ప్రియమైన వారిని అనుమానించకండి. వ్యాపారస్తులు లాభపడతారు. ప్రయాణాలు వాయిదా వేయడానికి ప్రయత్నించండి. 

Also Read:  మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!

Published at : 07 Jul 2022 04:19 PM (IST) Tags: astrology in telugu horoscope today in telugu Aaries Gemini Libra And Other Zodiac Signs July 2022 Monthly Horoscope astrological prediction for 8th july 2022 aaj ka rashifal 08 july 2022 horoscope

సంబంధిత కథనాలు

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

టాప్ స్టోరీస్

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌