News
News
X

Weekly Horoscope : ఈ రాశులవారు ఖర్చులు, ఆ రాశులవారు మొహమాటం తగ్గించుకోవాలి, ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 04 వరకూ ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope Weekly, August 29 to 04 September  2022

మేషం 
ఈ వారం కీలక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగానే సాగుతాయి. కుటుంబంలో శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి.

వృషభం 
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో మొహమాటం దరిచేరనీయకండి. బంధువులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులు టార్గెట్స్ రీచ్ అవుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం ఉంటుంది. ఓ వ్యవహారంలో మీ ముందుచూపు ప్రశంసలు అందుకుంటుంది. 

మిథునం
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యవహారాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు మీకు అందుతాయి.నిరుద్యోగులకు మంచి సమయం ఇది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఇంటర్యూలకు పిలుపొస్తుంది. 

Also Read: ఈ రెండులైన్ల వినాయకుడి శ్లోకంలో అంత అర్థం ఉందా!

కర్కాటకం 
మీ రంగాల్లో శుభఫలితాలు అందుతాయి. శ్రమకు మించిన ఫలితాలు అందుకుంటారు. వ్యవహారాలు నత్తనడకన కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.  వ్యాపారాలు కొంత సహనం పాటించాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది.  విద్యార్థుల కృషి కొంతవరకు ఫలిస్తుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలుండొచ్చు.

సింహం 
కొత్తగా తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వాహనం, భూమి కొనుగోలుపై దృష్టి సారిస్తారు. వ్యాపారాల్లో భాగస్వాములతో మంచి సఖ్యత ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.

కన్య 
తలపెట్టిన పనులు పూర్తయ్యేందుకు కుటుంబ సభ్యుల చేయూత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు పని విషయంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయి. వివాదాలకు, అదనపు ఖర్చులకు దూరంగా ఉండండి. పట్టుదలతో సక్సెస్ అందుకుంటారు..ఇంటా బయటా గౌరవం పొందుతారు

తుల 
అనుకున్న పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.ఆస్తి వివాదాల నుంచి  బయటపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులు ఆఫర్లు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..అనుభవజ్ఞులను సంప్రదించడం మంచిది.

Also Read: విఘ్నాధిపతిగా గణపతినే ఎందుకు పూజించాలి, వినాయక చవితి ప్రత్యేకత ఏంటి!

వృశ్చికం 
మొదలు పెట్టిన పనులు పూర్తిచేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్టు ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. అపార్థాలకు తావివ్వకండి.

ధనుస్సు 
ప్రారంభించిన పనులన్నీ అనుకున్న సమయం కన్నా ముందే పూర్తిచేస్తారు. ఉద్యోగులు,వ్యాపారులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. రాజకీయ వర్గాలవారికి అనుకూల సమయం ఇది. ఖర్చులు తగ్గించండి..వివాదాలకు దూరంగా ఉండండి. 

మకరం 
మకర రాశివారికి ఈవారం అంత అనుకూలంగా లేదు. గ్రహబలం తక్కువ ఉంది..మనోబలం తగ్గకుండా చూసుకోండి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగు, వ్యాపారులు, విద్యార్థులకు బాగానే ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.

కుంభం 
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు శుభసమయం. ఆలయాలు సందర్శిస్తారు. అప్పులు చేయాల్సి వస్తుంది, స్నేహితులతో వివాదాలున్నాయి. చిత్తశుద్ధితో పనిచేస్తే అనుకున్న పనులు పూర్తిచేస్తారు.

మీనం 
ప్రణాళికలో వేసుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. పారిశ్రామిక వర్గాలు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 

Published at : 29 Aug 2022 06:58 AM (IST) Tags: Horoscope Weekly astrology in telugu horoscope today Zodiac Signs astrological prediction for 29 August 2022 aaj ka rashifal 29th August 2022 August 29 to September 04

సంబంధిత కథనాలు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Karwa Chauth Atla Taddi 2022: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Karwa Chauth Atla Taddi 2022:   'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Horoscope Today 7th October 2022: ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Horoscope Today 7th  October 2022:  ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!