సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు.



పరమేశ్వరుడే… జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం.



పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. అవే పంచభూత లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. 



తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది ఆకాశలింగం.



పృథ్వి లింగం-కంచి
తమిళనాడు కంచి ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్న ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు.



వాయులింగం- శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం.



జలలింగం- జంబుకేశ్వరం
తమిళనాడులో కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది.



అగ్నిలింగం-అరుణాచలం
కొండ మీద వెలిసే దేవుని చూశాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం . ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు.