పాలు తాగేందుకూ ఓ పద్దతుంది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు పాలు తాగితే ఆరోగ్యకరమే, కానీ అతిగా తాగితే అనర్థమే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. రాత్రిపూట పడుకోవడానికి గంటముందు పాలను తాగాలి. తాగిన వెంటనే పడుకుంటే జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి వంటివి కలగవచ్చు. రోజుకు గ్లాసుడు పాలకు మించి తాగకూడదు. కొంతమందికి అతిగా తాగితే పాలలో ఉన్న ప్రోటీన్స్ వల్ల అలెర్జీలు కలిగే అవకాశం ఉంది. రోజూ పాలను అధికంగా తాగితే శరీరంలో ఆమ్ల స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఎసిడిటీ సమస్య ఉన్న వారు పాలను పరిమితంగా తీసుకోవాలి. పాలల్లో చక్కెర కలుపుకుని తాగే అలవాటు ఉంటే మానుకోండి. చక్కెరకు బదులుగా బెల్లం తురుము, తేనె, పసుపు వంటివి కలుపుకుని తాగితే చాలా మంది. పాలు తాగడానికి మంచి సమయం ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైమ్. అలాగే రాత్రి పడుకోవడానికి ఓ గంట ముందు. ఉదయం తాగిన పాలు శక్తినిస్తే, రాత్రి తాగిన పాటు మెదడుకు సాంత్వనను ఇస్తాయి.