క్రిప్టో కరెన్సీ పరిశ్రమలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు!



హఠాత్తుగా ఓ కొత్త క్రిప్టో కాయిన్‌ పుట్టుకొస్తోంది. గంటల్లోనే వందలను వేలు.. వేలను లక్షలు.. లక్షలను కోట్లుగా మార్చేస్తోంది.



సోమవారం షి జు (SHIH) అనే కొత్త టోకెన్‌ పుట్టుకొచ్చింది. చైనా సంతతికి చెందిన ఓ శునకం పేరును దానికి పెట్టారు.



ఈ టోకెన్‌ రెండు గంటల్లోనే విపరీతంగా ర్యాలీ అయింది. 6,00,000 శాతం ర్యాలీ అయిందని కాయిన్‌ మార్కెట్‌క్యాప్‌ తెలిపింది.



షిజు కాయిన్‌ 0.000000009105 నుంచి 0.00005477 వరకు పెరిగింది. ఎక్స్‌ఛేంజుల్లో వాల్యూమ్‌ 65 శాతం పెరిగింది.



అసలు ఈ టోకెన్‌ ఎందుకలా ర్యాలీ అయిందో? దానికి కారణాలేంటో? ఎవరికీ అంతుపట్టడం లేదు.



షిజు టోకెన్‌ విపరీతంగా ర్యాలీ కావడంతో రెండు గంటల్లోనే 1000 రూపాయలు ఏకంగా రూ.60 లక్షలుగా అయ్యాయి.



గతంలో కోకోస్వాప్‌, ఎథిరెమ్‌ మెటా, ఏఆర్‌సీ గవర్నన్స్‌ ఇలాగే హఠాత్తుగా ర్యాలీ అయ్యాయి. ఆ తర్వాత పతనానికి గురయ్యాయి.



ఇక షిజు విషయానికి వస్తే ఇదో క్రాస్‌ చైన్‌ ఆధారిత మీమ్‌ టోకెన్‌. మెటావర్స్‌ గేమింగ్‌, మల్టీ చైన్‌ వాలెట్‌, ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌ వ్యవస్థల మిశ్రమంగా బయటకు వచ్చింది.



షిజు క్రిప్టో చలామణీకి సంబంధించిన వివరాలు సరిగ్గా తెలియడం లేదని విశ్లేషకులు అంటున్నారు. గరిష్ఠంగా 1,000,000,000,000,000 షిజు కాయిన్లు సరఫరాలో ఉన్నాయి.