ఘృష్ణేశ్వరం- మహారాష్ట్ర ఔరంగబాద్ లో ఉంది శ్రీ ఘృష్ణేశ్వర జోతిర్లింగం.
దేవతలు నివసించే పుణ్యక్షేత్రం అని చెప్పే కాశీలో కొలువైంది విశ్వేశ్వర జ్యోతిర్లింగం.ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.
రామేశ్వరం- తమిళనాడు రామేశ్వరంలో ఉంది. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నీటి కొలనుల్లో స్నానమాచరిస్తే బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
శ్రీనాగనాథేశ్వర- మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉంది శ్రీనాగనాథేశ్వర ఆలయం. ఇది భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా చెబుతారు.
భీమశంకరం- మహారాష్ట్ర సహ్యాద్రి పర్వతఘాట్‌లో కృష్ణా ఉపనది భీమ నది ఒడ్డున వెలిసింది భీమశంకరం. శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.
గుజరాత్ సౌరాష్ట్ర జిల్లాలో కొలువైన సోమనాథుడిని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతారు.
వైద్యనాథ్- మహరాష్ట్రలో ఉన్న ఈ లింగాన్ని పూజిస్తే సకల వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే అమృతేశ్వరుడు అని పిలుస్తారు.
ఓంకారేశ్వర్ - మధ్యప్రదేశ్ లో నర్మదా నది తీరంలో ఉంది ఓంకారేశ్వర్ జోతిర్లింగం. ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం.
మహాకాళేశ్వర్- మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో కొలువుతీరాడు మహా కాళేశ్వరుడు. ప్రాతఃకాలం స్వామికి భస్మాభిషేకం చేసి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.
మల్లికార్జున స్వామి- పరమేశ్వరుడు గౌరీదేవితో కలిసి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా శ్రీశైలంలో వెలిశాడు.
త్రయంబకేశ్వర్- మహారాష్ట్ర నాసిక్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వరాలయం ఉంది. ఇక్కడి శివలింగము చిన్న గుంటలా కనిపిస్తుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగాలుంటాయి.
కేదార్ నాథ్ - ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉంది కేదారేశ్వలయం. ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది.