మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న కాలభైరవ ఆలయంలో శివుడికి మద్యపానమే నైవేద్యం. ఇక్కడ తాంత్రిక పూజలు జరుగుతుంటాయి

శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం తాంత్రి విధి విధానాలకు చాలా ప్రాచుర్యం చెందింది. ఇక్కడ సతీదేవి యోని పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారికి రుతుస్రావం జరుగుతుందని నమ్ముతారు.

మధ్యప్రదేశ్ లోని ఖజురహో దేవాలయం శిల్పకళలకే కాదు తాంత్రిక విద్యలకు ప్రాచుర్యం చెందింది.

హిమాచాల్ ప్రదేశ్ లో ఉన్న వైద్యనాథ మందిరంలో శివయ్యకి నిత్యం అఘోరాలు పూజలు చేస్తుంటారు.

పశ్చిమ బెంగాల్ కోల్ కతాలో కాళీఘాట్ లో ఉన్న కాళికాదేవి ఆలయంలో అమ్మవారి తల భాగం మాత్రమే ఉంటుంది.

మంత్ర, తంత్ర శక్తులను నేర్పించే దేవాలయాల్లో ముంబైలోని ముంబాదేవి దేవాలయం ముందుంటుంది. ఇక్కడ అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. నిత్యం అఘోరాలు వచ్చి పూజలు చేస్తుంటారిక్కడ.

రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉన్న ఏకలింగజి ఆలయంలో నాలుగు ముఖాలు గల శివుడి విగ్రహం దర్శనమిస్తుంది. నాలుగు ముఖాలు బ్రహ్మ, విష్ణు, ,మహేశ్వర, సూర్య అనే పేర్లతో పిలుస్తారు.

ఒడిశా భువనేశ్వర్ లో వైతల్ ఆలయంలో కొలువైన చాముండీ దేవిని కాళీమాత ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. పుర్రెల దండ ధరించి దర్శనమిచ్చే చాముండీ దేవికి నిత్యం అఘెరాలు తాంత్రిక పూజలు నిర్వహిస్తారు.

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారిని ఎవరికి నచ్చిన రూపంలో వారు పూజించుకుంటారు. జ్వాల, మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు.