శివతత్వానికి ఆలవాలంగా విలసిల్లే క్షేత్రాలు పంచారామాలు. జీవితకాలంలో ఈ పంచారామాలను ఒక్కసారైనా దర్శించుకుంటే పునర్జమ్మ ఉండదంటాడు.ముల్లోకాలనూ పీడించే తారాకాసురుడికి కుమారస్వామి చేతుల్లో మరణం తథ్యం అని శ్రీ మహావిష్ణువు దేవతలకు చెబుతాడు.యుద్ధం సమయంలో కుమార స్వామి కంఠంలో కొలువై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు తారకాసురుడు. అది ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడింది. అవే పంచారామాలుకుమారారామం: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుమారరామం అన్న పేరు వచ్చింది. భీమేశ్వరలింగం ఎత్తు 14 అడుగులు. రెండంతస్తుల మండపంంగల గర్భాలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.అమరారామం: గుంటూరు జిల్లా కృష్ణానది తీరంలో వెలసింది. అమరేశ్వర లింగం ఎత్తు 35 అడుగులు. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తుంది. మిగిలిన 20 అడుగులు భూమిలోపల ఉందని చెబుతారు. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం.సోమారామం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉంది సోమారామం. ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మామూలు రోజుల్లో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమికి తెల్లగా మెరిసిపోతుంది. చంద్రుడు ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రత్యేకత అని చెబుతారు.ద్రాక్షారామం: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉంది. దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం పేరు వచ్చిందంటారు. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రస్థిత మాణిక్యాంబదేవిగా విరాజిల్లుతోంది. గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది.ఇక్కడి శివలింగం సగం నలుపు, సగం తెలుపు వర్ణంలో ఉంటుంది.క్షీరారామం : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న ఈ శివలింగాన్ని సీతారాములు ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. స్వామివారు ఈశాన్య ముఖస్వరూపుడుగా దర్శనమిస్తాడు. 9 అంతస్తులతో నిర్మించిన 125 అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్పసంపదతో విశేషంగా ఆకట్టుకుంటుంది. చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు.


Follow for more Web Stories: ABP LIVE Visual Stories