Horoscope Today 11th May 2022:ఈ రాశులవారికి ఇంటా-బయటా గౌరవం పెరుగుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
![Horoscope Today 11th May 2022:ఈ రాశులవారికి ఇంటా-బయటా గౌరవం పెరుగుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి Horoscope Today : Aaries, Gemini, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs check Astrological Prediction Horoscope Today 11th May 2022:ఈ రాశులవారికి ఇంటా-బయటా గౌరవం పెరుగుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/89463bbabfe0d5cc03f4ce2020096cf6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2022 మే 11 బుధవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. పిల్లల విజయాలతో మీ మనసు ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.
వృషభం
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. పాత మిత్రులను కలుస్తారు.మనస్సులో గందరగోళ స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాలి. పై అధికారుల పట్ల మీ ప్రవర్తనను పాడు చేసుకోకండి. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
మిథునం
మీరు సామాజికంగా గౌరవాన్ని అందుకుంటారు. వృత్తిలో చికాకులు దూరమవుతాయి.వ్యాపారం పెరుగుతుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల పట్ల అధిక ఆసక్తి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే క్షీణిస్తున్న మీ సంబంధం మెరుగుపడుతుంది. పెద్దల సలహాలు పాటించండి.
Also Read: గుడిలో అడుగుపెట్టే ముందు ద్వారానికి( గడపకి) ఎందుకు నమస్కారం చేస్తారు
కర్కాటకం
మీరు మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ పని తీరుతో ప్రశంసలు అందుకుంటారు. శుభ కార్యాల్లో డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆలోచనను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి. కొత్త పనులకు రూపకల్పన చేయగలరు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
సింహం
శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కోరికలు ఏవైనా నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమను ఆనందిస్తారు. పెద్ద కంపెనీలో చేరడానికి లేదా భాగస్వామిగా ఉండేందుకు అవకాశం ఉండొచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోవద్దు.
కన్యా
కుటుంబ సభ్యుల సహకారంతో మీ పనులు పురోగమిస్తాయి. కోపం తగ్గించుకోండి, ఇతరుల కోపానికి గురవకండి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళ ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి.
తుల
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన వ్యాపార పర్యటన ఉండొచ్చు. విద్యార్థులు తమ చదువుల గురించి ఆందోళన చెందుతారు. మీ దినచర్య చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందవచ్చు. కర్మపై విశ్వాసం కలిగి ఉండండి.
Also Read: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం
వృశ్చికం
మీరు పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తి చేస్తారు. మీ పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. స్నేహితులకు తగినంత సమయం ఇవ్వండి. వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. యువత అభివృద్ధి చెందేందుకు అవకాశాలు లభిస్తాయి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు పూర్తి విశ్వాసంతో పని చేస్తారు. మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవవచ్చు.
మకరం
ఈ రోజంతా గందరగోళంలో ఉంటారు.ప్రేమికులు మధ్య సామరస్యం ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి గురుంచి చెడుగా ఆలోచిస్తారు. తెలివైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పాదాల మంట సమస్యతో బాధపడతారు. మీరు మీ ప్రవర్తనలో మార్పును అబ్జర్వ్ చేస్తారు.
Also Read: మహాభారతంలో ఈ పాత్రల్లో మీరు ఏటైపు, ఓ సారి చూసుకోండి
కుంభం
అదృష్టం మీకు కలిసొస్తుంది. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారతారు. ఆర్థిక పరంగా ఈ రోజు చాలా మంచిది. విద్యార్థులు కొన్ని ప్రత్యేక విజయాలు పొందుతారు. భాగస్వామ్య పని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. అధిక శ్రమ వల్ల అలసట చెందుతారు.
మీనం
మిమ్మల్ని ఉపయోగించుకునేవారిని దూరంగా ఉంచండి. మీ సహోద్యోగుల చెడు అలవాట్లను గమనించండి. కొత్త వ్యాపారాల్లో కొంత గందరగోళం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)