Horoscope Today 7th May 2022: ఈ రాశివారు తొందరగా మోసపోతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మే 7 శనివారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు ఇంటి అవసరాలు తీర్చడంపై శ్రద్ధ వహిస్తారు.ప్రయాణం సమయంలో వాహనం ఇబ్బంది పెడుతుంది. మాట్లాడేటప్పుడు పరుష పదాలు వినియోగించవద్దు. బంధువులతో వివాద సూచనలున్నాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. లావాదేవీల విషయంలో జాగ్రత్త.

వృషభం
వ్యక్తిగత పనులు చాలావరకూ పూర్తిచేస్తారు.  కుటుంబ పెద్దల మాటలను శ్రద్ధగా వినండి. చాలామంది మీతో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తారు. సామాజిక సేవలో మీ కార్యాచరణ పెరుగుతుంది. కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు అందుతాయి. ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. 

మిథునం
వివాహితులు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపార ప్రణాళిక రూపొందిస్తారు. పెట్టుబడులకు అనుకూల సమయం. డబ్బు లావాదేవీల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. అధిక శ్రమ అలసటకు కారణమవుతుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. 

Also Read: అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది

కర్కాటకం
విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత విలువల గురించి మీరు చాలా గర్వపడతారు. రచనా రంగంలో ఉన్నవారు ప్రశంసలు అందుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర చర్చలు జరపవద్దు.

సింహం
ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. కోపం తగ్గించుకోండి లేదంటే కొన్ని పనుల్లో నష్టపోతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారులు ఎక్కువ లాభాలు ఆశించవద్దు. వ్యవాహారాల్లో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు మరింత కష్టపడాలి. ఈ రోజు బాగానే ఉంటుంది. 

కన్య
ఈ రోజు మీకు మంచి రోజు. అదృష్టం కలిసొస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఊహించిన దానికన్నా ఉత్తమ ఫలితాలు పొందుతారు. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. మీరు సమాజంలో గౌరవం పొందుతారు.మీ మీ రంగాల్లో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి.

Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!

తులా
ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. అవసరమైన పనులను పూర్తి చేయగలరు. రావాల్సిన మొత్తం చేతికందుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులపై చాలా ఒత్తిడి ఉంటుంది. మీరు పెద్ద కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ పొందవచ్చు. వ్యాపార విస్తరణకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 

వృశ్చికం
ఈ రోజు విచారకరమైన వార్త వింటారు.వివాదాలకు దూరంగా ఉండండి. తెలిసిన వ్యక్తులు మిమ్మల్ని  మోసం చేయవచ్చు. పోటీ పరీక్షల్లో మీరు గొప్ప ఫలితాలు పొందుతారు. మీలో అంతర్గత శక్తి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. బయటి ఆహారాన్ని నియంత్రించండి. కీళ్ల నొప్పులతో బాధపడతారు.

ధనుస్సు
వ్యాపార భాగస్వాములతో  వివాదాలుంటాయి. అతి విశ్వాసం కారణంగా మీ పని ప్రభావితం అవుతుంది. అందర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. అదృష్టం కలిసొస్తుంది. ఇతరులను విమర్శిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఏదో విషయంలో విసుగు చెందుతారు.

మకరం
ఆదాయం పెరుగుతుంది. సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించండి...అనవసర వాదనలకు దిగొద్దు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. భక్తిభావం పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి.ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈ రోజు తిరిగి ప్రారంభించండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.

Also Read: అత్యాచారం చేసిన వాళ్లకి గరుడపురాణంలో శిక్షలివే

కుంభం
మీ పనిపై శ్రద్ధ వహించండి. తప్పుడు వ్యక్తులకు మద్దతివ్వకండి. కుటుంబంతో సమయం గడుపుతారు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

మీనం
మీ జీవిత భాగస్వామి పట్ల అభిమానం పెరుగుతుంది. ఇంటి వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. కొంతమంది మీ పట్ల చాలా ఆకర్షితులవుతారు.  వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాలి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. కొన్నిరోజులుగా నిలిచిన పనులు...కొద్దిపాటి శ్రమతో ఈ రోజు పూర్తిచేయగలుగుతారు.

Published at : 07 May 2022 05:31 AM (IST) Tags: Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Horoscope Today 7th may 2022

సంబంధిత కథనాలు

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Today Panchang 28 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

IAS Keerti Jalli :  అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి  సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్

Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్