IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Garuda Purana : అత్యాచారం చేసిన వాళ్లకి గరుడపురాణంలో శిక్షలివే

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. 30 గంటలకుపైగా మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశారు. ఇలాంటి మృగాలకు చట్టం ఎలాంటి శిక్ష విధిస్తుందో కానీ గరుడ పురాణంలో మాత్రం శిక్షలివే....

FOLLOW US: 

మానవ మృగాలు అనే పదం వినియోగిస్తాం కానీ మృగం కూడా తలదించుకునే లాంటి ఘటనలు జరుగుతున్నాయ్. ఎందుకంటే మృగానికి ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది, మిగిలిన విషయాల్లోనూ ఓ పరిమితి ఉంటుంది కానీ మనిషి ఆ పరిధి, పరిమితి దాటిపోయాడు.అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటన చూస్తే ఇలాగే అనిపిస్తోంది. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న కుమార్తెను కళ్లముందే లైంగికంగా వేధించడం చూసిన ఆ తల్లిదండ్రుల పరిస్థితేంటి?. మానసిక వికలాంగురాలు అంటే పసిపిల్లతో సమానం..అలాంటి మహిళని లైంగికంగా వేధిస్తే ఆమె ఎవరికి చెప్పుకోగలదు? ఇలాంటి రాక్షసులను శిక్షించేదెవరు?

ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా, కఠిన శిక్షలు విధించినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇలాంటి వారిని చట్టాలు వదిలిపెట్టినా పైవాడు వదిలేదే లే. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డే వారికి గరుడ పురాణం ప్రకారం దారుణమైన శిక్షలున్నాయి. 

Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!

పుయోద‌కం
పురుషులు లేదా మ‌హిళ‌లు ఎవ‌రైనా..ఎవర్నైనా అత్యాచారం చేసినా, లైంగికంగా వేధించినా నరకంలో విధించే శిక్ష ఇది. ఒక పెద్ద బావిలో మ‌లం, మూత్రం, ర‌క్తం, శ్లేష్మం నింపి అందులో ఆ వ్య‌క్తుల‌ను ప‌డేస్తారు. వాళ్లు ఎప్పటికీ ఆ బావిలోనే ఉండిపోవడమే. 

స‌ల్మ‌లి
వివాహేత‌ర సంబంధాలు పెట్టుకునే స్త్రీ, పురుషుల‌కు న‌ర‌కంలో య‌మ భ‌టులు విధించే శిక్ష సల్మలి. బాగా వేడి చేసిన ఓ ఇనుప స్తంభాన్ని నగ్నంగా కౌగిలించుకోమని చెప్పి యమభటులు కొరడాలతో కొడుతుంటారు. 

వ‌జ్ర‌కంఠక‌స‌లి
లైంగిక వాంఛ తీర్చుకునేందుకు జంతువులను కూడా వదలని దుర్మార్గులన్నారు. ఇలాంటి వ్యక్తులకు నరకంలో విధించే శిక్ష వజ్రకంఠసలి. సూదుల్లాంటి పెద్ద పెద్ద లోహాలను శరీరంలోకి గుచ్చి వారిని గాలిలో వేలాడదీసి శరీరాన్ని ఛిద్రం చేస్తారు.  

ల‌లాభక్షం
స్త్రీల‌ను కామంతో చూసే వారికి న‌ర‌కంలో విధించే శిక్ష లలాభక్షం. కుళ్లిపోయిన వీర్యంతో నిండిన స‌ముద్రంలో పాపుల‌ను ప‌డేసి ఎప్ప‌టికీ అందులోనే ఉంచుతారు.

అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. ఇందులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడుడికి చెప్పిన విషయాలను వేద వ్యాసుడు రచించాడు. మనిషి మరణం అనంతరం ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది...ఎక్కడికి వెళుతుంది, పుణ్యాలు చేస్తే  స్వర్గానికి, పాపాలు చేస్తే నరకానికి వెళతారని చెబుతూనే  అక్కడ విధించే శిక్షల గురించి వివరంగా గరుడ పురాణంలో ప్రస్తావించారు. 

Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?

Also Read:  కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

Published at : 22 Apr 2022 03:00 PM (IST) Tags: garuda puranam telugu garuda purana punishments garuda purana punishments list garuda purana in telugu punishments in hell garuda puranam deadly punishments

సంబంధిత కథనాలు

Shani Jayanti 2022: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట

Shani Jayanti 2022: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట

Kaala Bhairava Temple: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం

Kaala Bhairava Temple: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం

Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత

Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత

Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 26th May 2022:  ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్‌న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్‌న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!

CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Stock Market News: సెన్సెక్స్‌ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!

Stock Market News: సెన్సెక్స్‌ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!