By: ABP Desam | Updated at : 06 May 2022 05:31 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మే 6 శుక్రవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు మీరు దూర ప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన పనిని నిర్ణీత సమయానికి ముందే చేస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలనిస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎవ్వరి ముందూ నటించవద్దు.
వృషభం
ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మీరు మీ పనిని చేయగలుగుతారు. బంధువులను కలుస్తారు. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆలోచనలను బలంగా ఉంచుకోండి. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దంపతులు సఖ్యతగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మిథునం
వ్యాపారంలో లాభం ఉంటుంది. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూల్లో సక్సెస్ అవుతారు. ఈ రోజంతా బిజీగా ఉంటారు. . ఉన్నతాధికారుల సహకారంతో కష్టమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: శ్రీ చక్రం ఎంత పవర్ ఫులో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది
కర్కాటకం
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధిక వేడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఉద్వేగభరితంగా ఉండటం వల్ల మీరు మంచి విషయాల గురించి కూడా చెడుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది జాగ్రత్త. ఉద్యోగలు పదోన్నతి చెందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
సింహం
ఈరోజు మీరు ఏదో ఒక కారణంగా ఇబ్బందుల్లో పడతారు. ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలు చాలా బాగుంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఎప్పటి నుంచో పెండింగ్ ల ఉన్న మనీ చేతికందుతుంది. ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు..వారితో కనెక్ట్ అవుతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కన్యా
ఆఫీసులో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. చేయాలనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.కొత్త పని లాభిస్తుంది.
తులా
అధిక పని ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. మీ సామర్థ్యాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. విద్యార్థులు చదువుపై చాలా శ్రద్ధ వహిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం
కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పర్యాటక రంగానికి చెందిన వ్యక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు , విద్యార్థులకు సాధారణ ఫలితాలుంటాయి.
Also Read: ఆదిశంకరాచార్యులు ఎవరు, హిందూమత ఉద్ధరణ కోసం ఏం చేశారు
ధనుస్సు
వ్యాపారం విస్తరించేందుకు ప్లాన్ చేసుకుంటారు. నిలిచిపోయిన పనులు పూర్తికావడంతో మనసు ఎంతో సంతోషిస్తుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రవర్తన, పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీ బాధ్యతను నెరవేర్చడంలో మీరు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం
ఉద్యోగులు ప్రమోషన్‌తో చాలా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు శుభసమయం. దైవారాధనపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి.నిలిచిపోయిన పనులు ఈరోజు ప్రారంభం అవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం
స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. మీ ప్రణాళిక ఫలిస్తుంది. పిల్లల కెరీర్ మరియు చదువుకు సంబంధించిన సమస్యలు అధిగమిస్తారు. కార్యాలయంలో అధికారులతో సమావేశం అవుతారు. ఈరోజు చాలా శుభప్రదమైన రోజు అవుతుందికీళ్ల నొప్పుల వల్ల ఇబ్బంది పడతారు. మీరు సత్సంగం ప్రయోజనం పొందుతారు.
మీనం
అధిక ఖర్చులు ఒత్తిడిని కలిగిస్తాయి. అపరిచితులతో ఎక్కువగా మాట్లాడవద్దు. విలువైన వస్తువుల భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీ దినచర్యను మార్చుకోవడం వల్ల మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు. మీరు నమ్మిన వ్యక్తి మీకు తప్పుడు సమచారం ఇస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు
Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!
Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా
Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్ఫ్లవర్ ఆయిల్ ధరపై..!